ముగించు

కార్మిక శాఖ

కార్మిక శాఖ పాత్ర మరియు కార్యాచరణ:

  • వివిధ కార్మికచట్టాలను అమలుచేయటం.
  • పారిశ్రామిక వివాదాల పరిష్కారం, పారిశ్రామిక శాంతిని నెలకొల్పటం మరియు జీతభత్యాలకు సంబంధించిన వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడం.
  • కనీస వేతనాల చట్టం, వేతనాల చెల్లింపు చట్టం, సమాన వేతనం చట్టం, గ్రాట్యుటీ చెల్లింపు చట్టం, ఆంధ్రప్రదేశ్ దుకాణాలు మరియు సంస్థల చట్టం మరియు ఉద్యోగుల పరిహారచట్టం కింద పాక్షిక న్యాయవిధులు.
  • వేతనాలు, ఉద్యోగుల పరిహారం, గ్రాట్యుటీ, బోనస్ మొదలైనవాటి కోసం క్లెయిమ్‌ల పరిష్కారం, వేతనాలు, భద్రత, సంక్షేమం, పనిగంటలు, వారాంతపు & ఇతరసెలవులు, కార్మికులకు బోనస్ మరియు గ్రాట్యుటీ మొదలైనవి అమలు పరచుట.
  • షెడ్యూల్డ్ ఉద్యోగాల్లోని కార్మికులకు కనీస వేతనాలు అమలు పరచుట.
  • భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులు, కార్మిక సంఘాల నమోదు.
  • ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద మీసేవా సర్వీసెస్ ద్వారా కాంట్రాక్టర్లు మరియు ప్రిన్సిపల్ ఎంప్లాయర్స్, దుకాణాలు మరియు సంస్థలు, మోటారు రవాణా సంస్థలు, బీడీ మరియు సిగార్ సంస్థల నమోదు మరియు లైసెన్సింగ్.
  • బాలకార్మికులను గుర్తించి పునరావాసం కల్పించి విద్యనందించడం.
  • భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం క్రింద నిర్మాణ పనుల సంస్థల నుండి సెస్ వసూలుచేయుట.

పథకాలు / చర్యలు / చర్యప్రణాళిక:

  • ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా నమోదైన లబ్దిదారులకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడం.
  • ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా దుకాణాలు మరియు సంస్థలు, కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థ మొదలైన వాటిలో పనిచేసే కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయడం.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డు ద్వారా అసంఘటిత కార్మికులకు సహజ / ప్రమాద బీమా & అంగ వైకల్య పరిహారం అమలుచేయడం.

సంస్థ నిర్మాణం:

labour)hierarcy

సంప్రదింపులు:

చిరునామా:

O/o అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ లేబర్ , మచిలీపట్నం ,
C /o విష్ణు ప్రియ లాడ్జి , చెమ్మనగిరిపేట ,
మచిలీపట్నం – 521001

ముఖ్యమైన పరిచయాలు:
Sl. No. అధికారి పేరు హోదా మొబైల్ ఇ-మెయిల్
1 శ్రీ పి.వి.ఎస్.సుబ్రహ్మణ్యం డిప్యూటీ లేబర్ కమీషనర్, విజయావాడ 9492555088 dclvja88[at]gmail[dot]com
2 శ్రీ ఎం.శ్రీమన్నారాయణ అసిస్టెంట్ లేబర్ కమిషనర్, విజయవాడ 9492555089 vijayawada[dot]acl[at]gmail[dot]com
3 శ్రీ వి.చక్రధర్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్, గుడివాడ 9492555097 aclgudiwada[at]gmail[dot]com
4 శ్రీ కె.విజయ భాస్కర్ రెడ్డి అసిస్టెంట్ లేబర్ కమిషనర్, మచిలీపట్నం 9492555104 aclmtm12[at]gmail[dot]com
ముఖ్యమైన కార్మిక శాఖ వెబ్ సైట్లు:
Sl. No. శాఖ పేరు వెబ్‌సైట్ లింక్
1 కార్మిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం www.labour.ap.gov.in
2 ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు http://aplabourwelfareboard.ap.gov.in/aplwb/index.jsp
3 ఆంధ్రప్రదేశ్ భవనం మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు https://apbocwwb.ap.nic.in/