ముగించు

విభిన్న ప్రతిభావంతుల, టి.జి. మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ

విభాగం యొక్క పాత్ర మరియు కార్యాచరణ:

విభిన్న ప్రతిభావంతులు, టి.జి. మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశ్యం విభిన్న ప్రతిభావంతులను మాములు వారితో సమానంగా మరియు శక్తివంతగా చేయడం మరియు వయో వృద్ధులకు పరిరక్షణ కల్పించడం.విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ 1983లో స్థాపించడమైనది. ఈ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశ్యము విభిన్న ప్రతిభావంతులైన పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్ లు, ఉపకార వేతనములు మంజూరు, విభిన్న ప్రతిభావంతులైన వారికి స్వయం ఉపాధి పధకము క్రింద సబ్సిడీ మంజూరు, ఉపకరణముల మంజూరు, విభిన్న ప్రతిభావంతుల హక్కుల సాధనకు 2016 చట్టం మరియు నేషనల్ ట్రస్ట్ యాక్ట్ 1999.తల్లిదండ్రుల, వయో వృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం, 2007 మరియు ఆంధ్ర ప్రదేశ్ తల్లిదండ్రుల, వయో వృద్ధుల పోషణ మరియు సంక్షేమ నిబంధనలు, 2011 ద్వారా వయోవృద్ధుల సంరక్షణ మరియు పరిరక్షణ, పోషణ మరియు అప్పీలు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయుట.

పథకాలు:

పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనములు (యం.టి.ఎఫ్.) మరియు భోధన రుసుములు తిరిగి చెల్లించుట (ఆర్.టి.ఎఫ్.)

డిగ్రీ, పి.జి. మరియు వృత్తి విద్యా కోర్సులు (ఐ.టి.ఐ. & పాలిటెక్నిక్) చదువుచున్న విభిన్న ప్రతిభావంతులైన మరియు హిజ్రా, విద్యార్ధిని విద్యార్ధులకు,  జగనన్న విద్యా దీవెన ద్వార కాలేజీ ఫీజు తిరిగి చెల్లించుట మరియు జగనన్న వసతి దీవెన ద్వార ఐ.టి.ఐ. చదువుచున్న వారికి రూ. 10000/-, పాలిటెక్నిక్ చదువుచున్న వారికి  రూ.15000/-, డిగ్రీ, పి.జి. మరియు ఆ పై తరగతులు చదువుచున్న వారికి రూ.20,000/- భోజన మరియు మెస్ ఫీజులు చెల్లించుట.

 

అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణములు:

శారీరక వికలాంగులకు:  మూడు చక్రముల సైకిళ్ళు, చంక కర్రలు, వీల్ చైర్స్, కృత్రిమ అవయవములు, కాలిపర్స్ మంజూరు చేయబడును. డిగ్రీ, పి.జి (లేదా) వృత్తి విద్యా కోర్సులు చదువుచున్న రెగ్యులర్ విద్యార్ధులకు లాప్ టాప్స్ కూడా మంజూరు చేయబడును.

బధిరులకు (మూగ మరియు చెవిటి వారు):  శ్రవణ యంత్రములు, సైన్ లాంగ్వేజ్ తెలిసిన మూగ మరియు చెవిటి వారికి టచ్ ఫోన్లు, డిగ్రీ, పి.జి (లేదా) వృత్తి విద్యా కోర్సులు చదువుచున్న రెగ్యులర్ విద్యార్ధులకు లాప్ టాప్స్ కూడా మంజూరు చేయబడును.

అంధులకు:   అంధుల చేతి కర్రలు,  8 వ తరగతి నుండి డిగ్రీ చదువుచున్న రెగ్యులర్ విద్యార్ధులకు డైసీ ప్లేయర్స్ మంజూరు. డిగ్రీ, పి.జి (లేదా) వృత్తి విద్యా కోర్సులు చదువుచున్న రెగ్యులర్ విద్యార్ధులకు లాప్ టాప్స్ కూడా  మంజూరు చేయబడును.

 పై ఉపకరణములు అన్నియు www.apdascac.gov.in అను వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొనగలరు.

4% రిజర్వేషన్లు:

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ద్వారా ప్రత్యేక నియామకపు ప్రక్రియ ననుసరించి 4 శాతము రిజర్వేషన్ క్రింద వివిధ శాఖలలో గల  ఖాళీలను గుర్తించి వికలాంగులకు  బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుచున్నది.

వయోవృద్ధుల కొరకు సంక్షేమం:
ఉపకరణములు:

విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ వారి ద్వారా వయోవృద్ధులకు చేతి కర్రలు, చెవిటి మిషన్లు, యం.సి.ఆర్ చెప్పులు, కళ్ళజోళ్ళు ఉచితముగా పంపిణీ చేయబడును. వీరి యొక్కవార్షిక ఆదాయము రూ. 100000/-  కి మించి ఉండరాదు.

ప్రభుత్వ వృద్ధ వికలాంగుల శరణాలయం:

60 సం నిండిన అనాధ వయోవృద్ధులకు ఈడేపల్లి, మచిలీపట్టణం నందు ప్రభుత్వముచే వృద్ధ శరణాలయం నడుపబడుచున్నది. ఈ శరణాలయం నందు ఉచితముగా వసతి, భోజన సదుపాయములు ఏర్పాటు చేయడమేకాక  వారికి దుస్తులు, కాస్మటిక్స్, ట్రంకు పెట్టెలు, బంకర్ బెడ్స్ ఇవ్వడం జరుగుచున్నది. ప్రత్యేకముగా ఈ శరణాలయం నందు శిక్షణ పొందిన నర్స్ ద్వార నర్సింగ్ సేవలు అందజేయబడును.

వయోవృద్ధులకు గుర్తింపు కార్డులు:

ఈ శాఖ ద్వారా 60 సం నిండిన వయోవృద్ధులకు  గుర్తింపు కార్డులు జారీ చేయబడును. ఈ గుర్తింపు కార్డులు ఉన్న వారికి రైలు మరియు బస్సు ప్రయాణములలో టిక్కెట్టు రుసుములో 20% రాయితీ ఇవ్వబడును.

 

సంప్రదించవలసిన వివరాలు:
వ.సంఖ్య అధికారి పేరు హోదా ఫోను నం.
1 శ్రీ వి. కామ రాజు సహాయ సంచాలకులు 9000013613

ఇమెయిల్ :-

addwkrsn[at]gmail[dot]com

శాఖాధిపతి

శ్రీ వి. కామ రాజు, బి.కాం.
సహాయ సంచాలకులు,
విభిన్న ప్రతిభావంతులు, టి.జి మరియు
వయోవృద్ధుల సంక్షేమ శాఖ

కార్యాలయము యొక్క చిరునామా:

సహాయ సంచాలకులు,
విభిన్న ప్రతుభావంతులు, టి.జి మరియు
వయోవృద్ధుల సంక్షేమ శాఖ,
కలెక్టర్ కార్యాలయ ఆవరణ,
చిలకలపూడి, మచిలీపట్టణం – 521002.
కృష్ణాజిల్లా.
ఫోను నెంబర్. 08672-252637.