• సోషల్ మీడియా లింకులు
  • Site Map
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

ఆర్ధిక వ్యవస్థ

ఉపోద్ఘాతము

మండల స్థాయిలో స్థూల ప్రాధమిక స్థాయి ప్రణాళిక మరియు వికేంద్రీకృత ప్రణాళిక యొక్క ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యత రోజు రోజుకూ పెరుగుతున్నందున, వికేంద్రీకృత ప్రణాళిక తయారు చేయుటకు వివిధ అభివృద్ధి సూచికల యొక్క సరియైన సమాచారము అవసరము. వాటిలో మండలము యొక్క దేశీయ ఉత్పత్తుల అంచన లేక మండల ఆదాయము ముఖ్యమైన సూచికలు. ప్రణాళికలు తయారు చేసే వారికి అంతర మండల వైవిధ్యాలను పోల్చడానికి. మండల అసమానతలను పరీక్షించుటకు, సూక్ష్మస్థాయిలో (మండల స్థాయి) అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడానికి మండలము యొక్క తలసరి ఆదాయ సూచిక సహాయపడుతుంది. ఈ కాలములో ప్రాధమిక సమాచారపు లభ్యత క్రమముగా అభివృద్ధి చెందడం వలన మండల ఆదాయము కొరకు మెథడాలజీ పై సమగ్ర సమీక్ష డేటాబేస్ ను ఆధునీకరించుటకు స్థిరముగా తీసుకోనబడుచున్నది.

భావనలు మరియు నిర్వచనాలు

నిర్ణీత సమయములో సామాన్యముగా ఒక సంవత్సర కాలములో నకలు లేకుండా మండలము యొక్క నిర్ణీత భౌగోళిక సరిహద్దుల మధ్య ఉత్పత్తి కాబడిన వస్తువులు మరియు అందించబడిన సేవల యొక్క ఆర్ధిక విలువలు మొత్తాన్ని మండల దేశీయ ఉత్పత్తిగా (MDP)గా నిర్వచింపబడినది.

ఆర్ధిక రంగములు :

మండల దేశీయ ఉత్పత్తిని అంచనా వేయుట కొరకు ఆర్ధిక వ్యవస్థను మూడు రంగములుగా విభజించిరి.

  1. వ్యవసాయ మరియు అనుబంధ రంగము
  2. పారిశ్రామిక రంగము
  3. సేవా రంగము

వ్యవసాయ రంగము

వ్యవసాయ రంగము ఈ క్రింది వానిని కలిగియున్నది.

  1. వ్యవసాయము
  2. పశుసంపద
  3. అటవీ సంపద & కలప
  4. చేపల వేట

పారిశ్రామిక రంగము

పారిశ్రామిక రంగము ఈ క్రింది వానిని కలిగియున్నది.

  1. ఘనుల త్రవ్వకము & క్వారీ
  2. వస్తువుల తయారీ (ఆమోదించబడినవి & ఆమోదించబడనవి)
  3. కరెంటు, గ్యాస్ & నీటి సరఫరా
  4. నిర్మాణములు

సేవారంగము

సేవా రంగము ఈ క్రింది వానిని కలిగియున్నది.

  1. వ్యాపారము భోజన మరియు ఫలహారశాలలు
  2. రైల్వే
  3. ఇతర రవాణా సదుపాయములు మరియు నిల్వ
  4. కమ్యూనికేషన్స్
  5. బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్
  6. రియల్ ఎస్టేట్స్, నివాస మరియు వ్యాపార సేవల యాజమాన్యము
  7. ప్రజా పరిపాలన
  8. ఇతర సేవలు

ప్రస్తుత ధరలు

క్రొత్త బేస్ సంవత్సరము 2011 – 2012లో ధరలను బట్టి మండల ఆదాయ సూచికలు తయారు చేయబడినవి. 2015 – 2016 సంవత్సరములో ఉత్పత్తి కాబడిన వస్తువులు మరియు సేవల యొక్క ప్రస్తుత ధరలను బట్టి మండల దేశీయ ఉత్పత్తుల అంచనాలు లభ్యమగుచున్నవి.

పరిమితులు

వ్యవసాయ రంగము మరియు తయారీ రంగము తప్ప మిగతా రంగములలో మండల స్థాయి సమాచారము సరిపడినంత లభ్యమగుట లేదు. అందుచేత మండల స్థాయిలో దేశీయ ఉత్పత్తిని లెక్కించుటకు పైలట్ బేసిస్ ద్వారా తొలిప్రయత్నము జరిగినది. ఈ అంచనాలు తాత్కాలికమైనవి మరియు ఆధారపడదగిన, స్థిరమైన సమాచారము లభించినపుడు పునః సమీక్ష జరుగును.

జిల్లా జాతీయ ఉత్పత్తి జోడింపు వృద్ధిరేటును రాష్ట్ర వృద్ధిరేటుతో పోల్చుట
2018-19 (SRE) 2019-20 (FRE)
వర్గం జిల్లా రాష్ట్రం రాష్ట్రంలో జిల్లా వాటా శాతం జిల్లా రాష్ట్రం రాష్ట్రంలో జిల్లా వాటా శాతం
వ్యవసాయం 45779 274994 16.65 48791 309401 15.77
విద్యుత్ పరిశ్రమ 15505 181144 8.56 17238 202014 8.53
సేవలు 55926 333060 16.79 59601 370465 16.09
మొత్తం 117209 789197 14.85 125630 881881 14.25
వ్యక్తిగత ఆదాయం (రూపాయల్లో) 252824 152286 268109 168480