ముగించు

కలెక్టర్ కార్యాలయం

జిల్లా పరిపాలన నిర్వహణలో కలెక్టరేట్ ఆధార కేంద్ర బిందువు పాత్రగా వ్యవహరించును. జిల్లాకు ఐ.ఎ.ఎస్. హోదా కలిగిన అధికారి కలెక్టరు. కలెక్టరు న్యాయ వ్యవస్థ యొక్క అధికార పరిధిలో శాంతి భద్రతలను కాపాడుటకు జిల్లా న్యాయాధికారిగా పనిచేయును. ప్రధానముగా ప్రణాళిక మరియు అభివృద్ధి, శాంతి భద్రతలు, షెడ్యుల్డ్ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, సామాన్య ఎన్నికలు, ఆయుధ లైసెన్సులు మొదలగు వ్యవహారములను పరిశిలించును.

ఐ.ఎ.ఎస్. హోదా కలిగిన జాయింట్ కలెక్టర్ జిల్లలో శాసనముల ప్రకారము రెవిన్యూ పరిపాలన నిర్వహణ చేయును. వీరు అదనపు జిల్లా న్యాయమూర్తిగా కూడా హోదా కల్గియుండును. వీరు ప్రధానముగా పౌరసరఫరాలు, భూ సంబంధ విషయములు పరిశీలించును.

కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ల విధి నిర్వహణలో జిల్లా రెవిన్యూ అధికారి (డి.ఆర్.ఓ.) స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టరు హోదాలో సహాయకులుగా వ్యవహరించును. జిల్లా రెవిన్యూ అధికారి కాలేక్టరట్ లోని అన్ని శాఖలను నిర్వహించును. వీరు ముఖ్యముగా కలెక్టరేట్ లో జరుగు రోజువారీ కార్యక్రమములను పర్యవేక్షించుచూ సామాన్య పరిపాలన నిర్వహణను పరిసిలించును.
కలెక్టరుకు సామాన్య సహాయకుడుగా తహసీల్దారు హోదాలో పరిపాలనా నిర్వహణాధికారిగా వ్యవహరించును. వీరు కలెక్టరేట్ లోని అన్ని విభాగములను ప్రత్యక్షముగా పర్యవేక్షించును మరియు చాలా వరకు దస్త్రములన్ని (ఫైల్స్) వీరి ద్వారానే పంపబడును.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముచే పరిపాలన సౌలభ్యము కొరకు కలెక్టరేట్ ఎనిమిది విభాగములుగా విభజించబడినది.

అడ్మిన్ విభాగం :

శాఖల స్థాపన మరియు కార్యాలయ ప్రక్రియలు నిర్వహణ , జమా ఖర్చులు మరియు ఆర్ధిక లావాదేవీల అధికార పరిశీలనల నిర్వహణ.

కో – ఆర్డినేషన్ విభాగం :

ల్యాండ్ రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ & రిలీఫ్ చర్యలు, ప్రోటోకాల్, ఎలక్షన్స్ అండ్ రెసిడ్యూరీ వర్క్, ల్యాండ్ కన్వర్షన్, వన్ టైమ్ కన్వర్షన్, రైట్స్ రికార్డ్, వాటర్ యూజర్ అసోసియేషన్స్, జమాబందీ, పరీక్షలు, స్టేట్ ఫంక్షన్‌లు & పండుగలు, విగ్రహాలు.”>ల్యాండ్ రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ & రిలీఫ్ చర్యలు, ప్రోటోకాల్, ఎలక్షన్స్ అండ్ రెసిడ్యూరీ వర్క్, ల్యాండ్ కన్వర్షన్, వన్ టైమ్ కన్వర్షన్, రికార్డ్ ఆఫ్ రైట్స్ , వాటర్ యూజర్ అసోసియేషన్స్, జమాబందీ, పరీక్షలు, స్టేట్ ఫంక్షన్‌లు & పండుగలు, విగ్రహాలు.

మెజిస్టి రియల్ విభాగం :

మెజిస్టీరియల్ (కోర్టు/లీగల్) వ్యవహారాలు , లా & ఆర్డర్ , PD చట్టం , వారెంట్లు , సినిమాటోగ్రఫీ చట్టం , జనాభా లెక్కలు , ఆయుధాల చట్టం & నియమాలు , పెట్రోలియం చట్టం మరియు నియమాలు , సమాచార హక్కు చట్టం-2005, పాత్ర మరియు పూర్వాపరాల ధృవీకరణ, SARFAESI చట్టం, రాష్ట్ర / జాతీయ మానవ హక్కుల కమిషన్”>మెజిస్టి రియల్ (కోర్టు/లీగల్) వ్యవహారాలు , లా & ఆర్డర్ , PD చట్టం , వారెంట్లు , సినిమాటోగ్రఫీ చట్టం , జనాభా లెక్కలు , ఆయుధాల చట్టం & నియమాలు , పెట్రోలియం చట్టం మరియు నియమాలు , సమాచార హక్కు చట్టం-2005,
పాత్ర మరియు పూర్వాపరాల ధృవీకరణ, SARFAESI చట్టం, రాష్ట్ర / జాతీయ మానవ హక్కుల కమిషన్

భూముల విభాగం :

భూ పరిపాలన, భూ అన్యాక్రాంతం, జాతీయ రహదారులు మరియు సాధారణ ప్రయోజనాల కోసం భూ సేకరణ, ఎస్టేట్ నిర్మూలన చట్టం, ఇనామ్ నిర్మూలన చట్టం, భూ ఆక్రమణ చట్టం-1905, వక్ఫ్ బోర్డు భూ సమస్యలు, ప్రభుత్వ నిషేధిత జాబితాలతో వ్యవహరిస్తుంది. & అసైన్డ్ భూములు, భూసేకరణలో ఆర్బిట్రేషన్ కేసులు, సాంఘిక సంక్షేమ భూసేకరణ”>భూ పరిపాలన, భూ అన్యాక్రాంతం, జాతీయ రహదారులు మరియు సాధారణ ప్రయోజనాల కోసం భూ సేకరణ, ఎస్టేట్ నిర్మూలన చట్టం, ఇనామ్ నిర్మూలన చట్టం, భూ ఆక్రమణ చట్టం-1905, వక్ఫ్ బోర్డు భూ సమస్యలు, ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా , అసైన్డ్ భూములు, భూసేకరణలో ఆర్బిట్రేషన్ కేసులు, సాంఘిక సంక్షేమ భూసేకరణ .