కొత్త_జిల్లా గురించి
జనరల్
ఆంధ్ర ప్రదేశ్ కు కోస్తా జిల్లాగా మరియు కృష్ణా జిల్లాకు జిల్లా కేంద్రంగా మచిలీపట్నం ఉన్నది .ఈ జిల్లాను పూర్వంలో మచిలీపట్నం అని పిలిచేవారు తరువాత పవిత్ర నది కృష్ణా నది పేరుతో కృష్ణా జిల్లాగా పేరు మార్చబడినది . 1859లో అప్పటి గుంటూరు జిల్లా రద్దు చేయబడినప్పుడు, దాని జిల్లాకు కొన్ని తాలూకాలు చేర్చబడి, కృష్ణా నది ఉండటం వల్ల కృష్ణా జిల్లాగా పేరు మార్చబడింది. మళ్లీ 1925లో కృష్ణా జిల్లాను కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు. జిల్లాలో కొన్ని చిన్న మార్పులు తప్ప అధికార పరిధిలో ఎలాంటి మార్పులు లేవు . మళ్లీ 2022లో కృష్ణా జిల్లాను కృష్ణా, ఎన్ . టి . ఆర్ జిల్లాలుగా విభజించారు.
ఈ జిల్లా చుట్టూ తూర్పున బంగాళాఖాతం , పడమరన గుంటూరు జిల్లా , దక్షిణాన బంగాళాఖాతం , పశ్చిమాన బంగాళాఖాతం మరియు ఉత్తరాన ఏలూరు మరియు ఎన్ . టి . ఆర్ . జిలాలు ఉన్నవి .
జిల్లా 25 మండలాలుగా చేస్తూ , మూడు రెవెన్యూ డివిజన్ లు 1. బందరు 2. గుడివాడ మరియు 3. ఉయ్యూరుగా విభజించబడింది. డెల్టా భూమి కృష్ణా నది కాలువల ద్వారా సాగునీటిని పొందుతోంది.
జిల్లాలో జనాభా 17 , 35, 079 , ఇందులో 486 జనావాసా గ్రామాలు మరియు 16 జనావాసాలు లేని గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 3 మునిసిపాలిటీలు 1. పెడన 2. గుడివాడ 3. ఉయ్యూరుగా మరియు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి.
భౌతిక లక్షణాలు
లాటిట్యూడ్
15° 71’ N and 16° 47’ N
లాంగిట్యూడ్
80° 71’ and 81° 54’ of E
వైశాల్యము
3,773 Sq. Kms
తీర రేఖ
88 Kms
సరిహద్దులు
తూర్పు
బంగాళాఖాతం
పశ్చిమం
గుంటూరు జిల్లా
ఉత్తరం
ఏలూరు మరియు ఎన్ . టి . ఆర్ . జిలాలు
దక్షిణం
బంగాళాఖాతం
నదులు

ఈ జిల్లాలో ప్రసిద్ధి చెందిన కృష్ణానది ప్రవహిస్తోంది. దక్షిణంలో ప్రవహించే పవిత్రమైన నదులు గోదావరి , కావేరీ వంటి నదులలో కృష్ణానది ఒక్కటి . ఈ జిల్లాలో ప్రధాన వాగు బుడమేరు ప్రవహిస్తోంది .
వాతావరణం మరియు వర్షపాతం

ఈ జిల్లాలో వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి మరియు శీతాకాలంతో చల్లని ఉష్ణమండల వాతావరణ కూడిన పరిస్థితులు నెలకొంటాయి. ఏప్రిల్ నుండి జూన్ వరకు అత్యంత వేడిగా ఉండే నెలలు , మేలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. రుతుపవనాలు సాధారణంగా జూన్ మధ్యలో నుండి అక్టోబర్ మధ్య వరకు మంచి వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లా సాధారణ వర్షపాతం 1047.68 మిల్లీమీటర్లు , ఇందులో 2/3% వంతు నైరుతి రుతుపవనాల ద్వారా పొందబడుతాయి . 2019-20లో సగటు వర్షపాతం 868.37 మిల్లీమీటర్లు.
నేలలు

ఈ జిల్లాలో ముఖ్యంగా మూడు రకాల నేలలు ఉంటాయి అంటే, 57.6% శాతం ఉన్న నల్ల నేలలు , 22.3% శాతం ఇసుక బంకమట్టి మరియు 19.4% శాతం ఎర్రమట్టి నేలలు ప్రబలంగా ఉన్నాయి, సముద్ర తీరంలో 0.7% అంచులు చిన్న ఇసుక నేలలుగా ఉంటాయి .
వ్యవసాయం

జిల్లా అనేక రకాలైన నేలలతో కూడి వ్యవసాయంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. వ్యవసాయం చాలా ముఖ్యమైన వృత్తి మరియు వరి ఉత్పత్తి చేసే ప్రధాన ఆహార పంట. జిల్లా 2019-20 స్థూల పంట విస్తీర్ణంలో 3.76 లక్షల హెక్టార్లు కాగా, స్థూల సాగునీటి ప్రాంతంలో 2.42 లక్షల హెక్టార్లు.
రవాణా మరియు కమ్యూనికేషన్లు

జిల్లాలో రోడ్లు మరియు రైల్వే సంస్థల ద్వారా బాగా సేవలు అందిస్తోంది. 502 గ్రామాలు (కొన్ని ప్రధాన గ్రామాలతో సహా) రవాణా సౌకర్యాలతో అనుసంధానించబడ్డాయి . ఈ జిల్లాకు ప్రధాన రైల్వే జంక్షన్ గా గుడివాడ మరియు మచిలీపట్నం అనుసంధానించబడిన ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్ గా ఉంది.
ఈ జిల్లాకు గన్నవరంలో ఏరోడ్రోమ్ మరియు మచిలీపట్నంలో ఒక చిన్న ఓడరేవు కూడా ఉంది.
అక్షరాస్యత

కృష్ణా జిల్లా 2011 జనాభా లెక్కల ప్రకారం 73.75 అక్షరాస్యతను నమోదు చేసింది . ఈ జిల్లా విద్యారంగంలో చాలా ముందుంది. జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఎన్ . టి . ఆర్ . వైద్య విశ్వవిద్యాలయం విజయవాడలోనే ఉన్నది .
ఖనిజ వనరులు:
1. సల్ఫర్ : కోన , మచిలీపట్నం మండలం.
