ముగించు

గనులు మరియు భూగర్భశాస్త్రం

శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ:

శాఖా యొక్క ప్రాత  మరియు కార్యాచరణ ప్రభుత్వము ఖజానాకు ఖనిజ ఆదాయం సేకరించుట కృష్ణా  జిల్లాలో APMMC Rules, 1966 in case of Minor Mineral and M.C Rules. 1960 and MMC (D&R) Avt, 1957 మరియు ఇతర నియమాల విస్తృతి పరిదిలో జిల్లా లో ఖనిజ క్రమ బద్దికరణ పనుల ప్రచారము మరియు అభివృద్ధి ఈ కాకర్యలయము యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ యొక్క విదులు ఈ కార్యాలయము సుక్ష్మ ఖనిజమూల కొరకు ధరఖస్తులు స్వికరించును తనిఖ నిర్వహించిన తరువాత ప్రధాన ఖనిజముల కరకు ప్రతిపాదనలను గనులు మరియు భూగర్బ శాస్త్ర శాఖ యొక్క డైరెక్టర్ , హైదరాబాద్ వారికీ మరియు సుక్ష్మ ఖనిజాల కరకు ప్రతిపాదనలను గనులు మరియు భూగర్బ శాస్త్ర శాఖ డిప్యూటీ డైరెక్టర్ వారికీ పంపించాడును. ధరఖస్తుదరులకు ఖనిజాల లభ్యత గురించి మరియు ఆర్ధిక పరమైన గనుల త్రావకపు పద్దతుల గురించి, ఆర్ధికపరమైన ఖనిజాల అన్వేషణ కొరకు ప్రాంతాల సాధ్యత గురించి మార్గదర్శకాలు ఇవ్వబడును. ప్రస్తుతము ఈ కార్యాలయము గ్రానైట్ తో చేయుబోవు పనులకు అధికార పూరిత అనుమతి (లై సెన్స్) కొరకు, గ్రానైట్ క్వారీ లీజుకు సిఫార్సు చేయచేయబడిన గగ్రంటుకు కొరకు, క్రొత్త పారిశ్రామిక వేత్తలు దరఖాస్తులు దాఖలు చేసే విధముగా ప్రోత్సహించుచున్నది ఆయ విషయాలలో ఖనిజము సమర్ధవంతముగా ఉపయోగాపదినట్లైతే ఈ జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ వచ్చు అవకాసము కలదు. ముందుస్తు  అద్దెలు (Advance Dead rents) భద్రత కరకు జమ చేయుబడిన రుసుములు (security Deposit Amounts) మరియు అవసరమైన నమోదు చార్జీలు (Registration Charges) మొదలగునవి వాసులు చేస్తూ m.c Rules, 1960 and APMMC Rules 1966 ప్రకారము మంజూరు చేయబడిన లీజుకు అమలు చేయుట ఈ కార్యాలయము యొక్క విధులలో ఒక భగము. గనుల త్రావకపు లిజులు అమలు చేయట అనునది రిజిస్ట్రేషన్ పూర్తైనది తరువాత మాత్రమే త్రావకపు కార్యకలాపాల నిర్వహణకు అనుమతిచాబడను.

ఈ కార్యాలయ యొక్క సాంకేతిక సిబ్బంది ప్రధాన మరియు సుక్ష్మ ఖనిజాల రయితి కొరకు సంబందిత ప్రాంతాలలో తనిఖలు నిర్వహిస్తారు. ఈ సిబ్బంది ఖనిజాల అక్రమ రవాణా అడ్డుకోనుటకు సాధారణ మరియు ఆకస్మిక తనిఖలు నిర్వహిస్తారు.

కృష్ణా జిల్లా నందు గనులు మరియు భూగర్భ శాఖ  కృష్ణా-I మరియు కృష్ణా-II  కార్యాలయముగా విజయవాడ మరియు నందిగామ నందు ముఖ్య కార్యాలయములు గా  01.04.2003 నుంచి  కలవు. కృష్ణా జిల్లా నందు గల మొత్తం 53 మండలాలో 46 మండలములు విజయవాడ కార్యాలయ పరిధిలో మరియు 7 మండలములు నందిగామ కార్యాలయ పరిధిలో కలవు.

జిల్లాలో లభ్యమగు ముఖ్య ఖనిజముల వివరములు:
పెద్ద తరహా ఖనిజములు
లైమ్  స్టోన్ లైమ్  స్టోన్ ఖనిజము జగ్గయ్యపేట మండలం నందు లభ్యమగును
ఐరన్ ఓర్ ఐరన్ ఓర్ ఖనిజము జగ్గయ్యపేట మండలం నందు లభ్యమగును
చిన్న తరహా ఖనిజములు
గ్రానైట్ కలర్ గ్రానైట్ ఖనిజము ఎ.కొండూరు, గంపలగూడెం మరియు వీరులపాడు మండలములలో మరియు బ్లాక్ గ్రానైట్ ఖనిజము  జగ్గయ్యపేట మండలం నందు లభ్యమగును.
రోడ్ మెటల్ అర్కియన్ రాక్స్, చర్నకైట్స్ లు మరియు ఇతర శిలలు రోడ్ మెటల్ మరియు రైల్వే బల్లాస్ట్ గా  ఉపయోగపడును. ఈ తరహా ఖనిజములు ఇబ్రహింపట్నం, జి.కొండూరు, ఎ.కొండూరు, కంచికచెర్ల, జగ్గయ్యపేట మరియు చందర్లపాడు మండలములలో కలవు. ఈ ప్రాంతాలలో ఈ ఖనిజ లభ్యత మీద ఆధారపడి స్టోన్ క్రషింగ్ యూనిట్లు కూడా స్థాపించ బడివున్నవి.
బిల్డింగ్ స్టోన్ మరియు గ్రావెల్ బిల్డింగ్ స్టోన్ ఖోండలైటిస్, గొల్లపల్లి ఇసుక రాతి శిలల నుండి మరియు గ్రావెల్ ఖోండలైటిస్ క్షయీకరణ వలన వచ్చును.  ఈ తరహా ఖనిజములు గన్నవరం, బాపులపాడు, అగిరిపల్లి, నూజివీడు మరియు విజయవాడ రూరల్  మండలములలో కలవు.
క్వార్ట్జ్(పలుగు రాయి) క్వార్ట్జ్ ఖనిజము యొక్క లభ్యత జిల్లాలో  ఉత్తర మండలాలు అయిన ఎ.కొండూరు, తిరువూరు, విస్సన్నపేట మండలములలో కలదు.
ఇసుక సాధారణ ఇసుక (నది ఇసుక)  కృష్ణా నది మరియు దీని ఉప నదులైన మున్నేరు, వైరా మొదలగు పరివాహక ప్రాంతాలలో లభ్యమగును.    కృష్ణా జిల్లా నందు నాగాయలంక, పమిడిముక్కల, కంకిపాడు, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, తొట్లవల్లూరు, పెనమలూరు, నందిగామ, పెనుగంచిప్రోలు, వత్సవాయి, చందర్లపాడు మరియు కంచికచెర్ల  మండలంలో ఇసుక రీచ్లు అందుబాటులో కలవు.

శాఖ ముఖ్య విధులు :

ఈ శాఖ ఖనిజాలకు వ్యవస్థ నకు సంబంధించి అన్ని అభివృద్ధి మరియు క్రమబద్దీకరణ పనులు నిర్వర్తించును.ఈ క్రింది ముఖ్యమైన పనులు ఈ శాఖ నిర్వర్తించును.

 • ఖనిజ కౌలు దరఖాస్తుల స్వీకరణ మరియు వాటిని ప్రాససింగ్ చేయుట.
 • ఖనిజ ఆదాయ సేకరణ
 • గనులు మరియు క్వారీ లను తనిఖీ చేయుట
 • అక్రమ మైనింగ్ మరియు రవాణా ను అరికట్టుట
 • ఖనిజ ఆధారిత సంస్థలను ప్రోత్సహించుట
 • ఖనిజ ఉత్పత్తిని సమీక్షించుట
 • ఇసుక రీచ్ లకు సంబంధించి మైనింగ్ ప్లాన్ తయారు చేయుట మరియు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకుని వచ్చుటకు కావలసిన నివేదికలు సమర్పించి ఇతర శాఖల సహకారంతో ఇసుక రీచ్ లు ప్రజలకు అందుబాటులో ఉండునట్లు చేయుట.
 • లీజుదారులనుంచి ఆదాయ పన్ను వసూలుచేసి వాటిని ఆదాయపన్ను రిటర్న్స్ ఫైలింగ్ చేయుట.
 • జిల్లా ఇసుక కమిటీ నందు మెంబర్ కన్వీనర్ గా భాద్యతలు నిర్వహణ
 • జిల్లా ఖనిజ వ్యవస్థాపక ట్రస్ట్ నందు మెంబెర్ కన్వీనర్ గా భాద్యతలు నిర్వహణ
 • కొత్త ఖనిజముల సేకరణ మరియు వాటి అభివృద్ధి.

ఈ శాఖ యొక్క నిర్మాణ క్రమం :

Telugu- Mines & Geology Dept

జిల్లా లో ఈ శాఖ యొక్క పరిధి :

సహాయ సంచాలకులు, గనులు మరియు భూగర్భ శాఖ (కృష్ణా-I), విజయవాడ :

46 మండలములో విస్తరించి వున్నది.

1 విజయవాడ రూరల్ 17 తిరువూరు 33 మొవ్వ
2 విజయవాడ తూర్పు 18 ఉయ్యూరు 34 మండవల్లి
3 విజయవాడ మధ్యమం 19 మైలవరం 35 ఎ.కొండూరు
4 విజయవాడ ఉత్తరం 20 పెడన 36 నాగాయలంక
5 విజయవాడ పడమర 21 ముదినేపల్లి 37 ఉంగుటూరు
6 మచిలీపట్టణం 22 అగిరిపల్లి 38 బంటుమిల్లి
7 పెనమలూరు 23 విస్సన్న పేట 39 రెడ్డిగూడెం
8 గుడివాడ 24 జి.కొండూరు 40 కోడూరు
9 నూజివీడు 25 ముసునూరు 41 అవనిగడ్డ
10 ఇబ్రహింపట్నం 26 పామర్రు 42 ఘంటసాల
11 గన్నవరం 27 పమిడిముక్కల 43 తోట్లవల్లుర్
12 బాపులపాడు 28 చల్లపల్లి 44 నందివాడ
13 కైకలూరు 29 చాట్రాయి 45 మోపిదేవి
14 గంపలగూడెం 30 గుడ్లవల్లేరు 46 పెదపారుపూడి
15 కలిదిండి 31 గూడూరు
16 కంకిపాడు 32 కృతివెన్ను

సహాయ సంచాలకులు, గనులు మరియు భూగర్భ శాఖ (కృష్ణా-II), నందిగామ :

7 మండలములో విస్తరించి వున్నది.

1 నందిగామ
2 వత్సవాయి
3 వీరులపాడు
4 కంచికచెర్ల
5 చందర్లపాడు
6 పెనుగంచిప్రోలు
7 జగ్గయ్యపేట

నూతన ఇసుక మైనింగ్ విధానం – 2019 :

రాష్ట్ర ప్రభుత్వం 2019 లో తీసుకు వచ్చిన నూతన ఇసుక మైనింగ్ విధానం – 2019 లో భాగంగా ఇసుక క్వారీని నడుపుట మరియు ప్రజలకు ఇసుకను సరఫరా చేయుటకు గాను  ప్రభుత్వం మెస్సర్స్  ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ కు భాద్యతలు అప్పగించినది. తద్వారా ప్రజలకు  ఇసుకను అందుబాటులోని ధరలకు అందిస్తూ, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరునని ఈ నూతన ఇసుక విధానమును ప్రవేశ పెట్టబడినది.

సంప్రదించవలసిన వివరములు:
వరుస సంఖ్య అధికారి మరియు హోదా సెల్ నెంబర్ మెయిల్ చిరునామ
1 ఉప సంచాలకులు, గనులు మరియు భూగర్భ శాఖ, కృష్ణా, విజయవాడ 9100688838 ddmgkrishna[at]gmail[dot]com
2 సంచాలకులు, గనులు మరియు భూగర్భ శాఖ, విజయవాడ 9100688838 advijayawada16[at]gmail[dot]com
3 సంచాలకులు, గనులు మరియు భూగర్భ శాఖ, నందిగామ 9100688829 admgnandigama009[at]gmail[dot]com
ముఖ్యమైన లింకులు :
Sl.No Scheme Website address
1 గనులు మరియు భూగర్భ శాఖకు సంబందించిన సమాచార నిమిత్తం mines.ap.gov.in
2 ఇసుకకు సంబందించిన సమాచార నిమిత్తం sand.ap.gov.in