ముగించు

జిల్లా పంచాయతీ కార్యాలయం

కృష్ణా జిల్లాలో గ్రామా పంచాయతిల ముఖ చిత్రం :-

వీలిన మండలాలును కలుపుకొని 49 మండలాలు 980 గ్రామా పంచాయతిలు కలిగిన జిల్లా కృష్ణా జిల్లా . 516 సమూహా గ్రామపంచాయతీలు ముఖ్య కేంద్రంగా సుమారు 323 పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తూ ఉన్నారు.గ్రామీణ ప్రజానీకానికి పౌర సదుపాయాలు కల్పనే ముఖ్య లక్ష్యంగా పంచాయతి రాజ్ శాఖ పనిచేస్తుంది.

పౌర సదుపాయాలు :-

పారిశుధ్యం, మంచినీటి / త్రాగునీటి సరఫరా , వీధి దీపాలు వంటి సదుపాయాలతో పాటు నిధుల లభ్యతకు తగ్గట్టుగా గ్రామం లోపల గ్రామం చుట్టుపక్కల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఈ శాఖ నిర్వర్తిస్తుంది. ఇవే కాకుండా జిల్లా పరిపాలన యంత్రాంగం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు అప్పగించే పించన్ల పంపిణి వంటి సామాజిక భద్రత పధకాల అమలు, ఐ యస్ ఎల్ నిర్మాణంలో పాలు పంచుకోవడం వంటి భాద్యతలను ఈ శాఖ నెరవేరుస్తుంది.