ముగించు

డి ఆర్ డి ఎ

జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ – వెలుగు – కృష్ణా జిల్లా

ప్రొఫైల్ :

రాష్ట్ర స్థాయిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) యొక్క పరిపాలనా నియంత్రణలో పనిచేస్తోంది. ప్రస్తుతం శ్రీ పి.రాజా బాబు, ఐఎఎస్ సిఇఒ, సెర్ప్ పదవిలో ఉన్నారు, శ్రీ పి.రామచంద్రారెడ్డి గౌరవ మంత్రి గారు కృష్ణా జిల్లాలో ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఉన్నది.
జిల్లా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (డిపిఎంయు) డిపిఎంయును ప్రాజెక్ట్ డైరెక్టర్,డిఆర్డిఎ-వేలుగు ప్రధాన కార్యాలయం మాచిపట్నం వద్ద నిర్వహిస్తుంది.

ORGANOGRAM:


ప్రతి వ్యక్తి పేద కుటుంబం మంచి జీవనోపాధిని సంపాదించుటకు మరియుగ్రామీణ పేదలకు వారి ప్రాధాన్యత అవసరాలను తీర్చడానికి (జీవనోపాధి) అవకాశాలను మెరుగుపరచడంలోఇది ఒక అంతర్భాగం.

వెలుగు భావన:

సామాజిక సమీకరణ & మహిళా సాధికారత ద్వారా పేదరికాన్ని ప్రభావితం చేసే అన్ని సమస్యలను పరిష్కరించుట.స్వీయ సుస్థిర ప్రజల సంస్థలను అభివృద్ధి చేయుట సంస్థల సామర్థ్యాలను మెరుగుపరచుట సామాజిక పెట్టుబడి అభివృద్ధి వనరుల మద్దతు.

Processes:

పేద కుటుంబాల గుర్తింపు స్వయం నిరంతర  ప్రజల సంస్థలను అభివృద్ధి పరచుట సంస్థల సామర్థ్యాలను మెరుగుపరచుట సామాజిక పెట్టుబడి అభివృద్ధి
వనరుల మద్దతు క్రెడిట్ ప్లానింగ్ పర్యవేక్షణ & మూల్యాంకనం సెన్సిటివ్ సపోర్ట్ మెకానిజం.

పథకాలు / చర్యలు / చర్య ప్రణాళిక :

1. YSR పింఛను పధకం :

పింఛను పొందుటకు తప్పనిసరిగా నిరుపేద కుటుంబమునకు చెందినవారై ఉండవలెను. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండవలెను.  వీరు గవర్నమెంట్ కు చెందిన మరి ఏ ఇతర పింఛను పొందుతూ ఉండరాదు.

వరుస సంఖ్య పింఛనుల వివరాలు పింఛను మొత్తము అర్హతలు
1 వృధాప్య పింఛనులు 2250 60 సంవత్సరముల వయస్సు కలిగి యుండవలెను.
2 చేనేత కార్మికుల  పింఛనులు 2250 50 సంవత్సరముల వయస్సు కలిగి చేనేత సొసైటీలో సభ్యత్వము కలిగి యుండవలెను.
3 వికలాంగుల పింఛనులు 3000 ‘సదరం’ సర్టిఫికెట్ కలిగి యుండవలెను.
4 వితంతు పింఛనులు 2250 భర్త మరణ ధ్రువీకరణపత్రము కలిగి యుండవలెను, 18 సంవత్సరముల వయస్సు కలిగి యుండవలెను.
5 కల్లు గీత కార్మికుల పింఛనులు 2250 50 సంవత్సరముల వయస్సు కలిగి కల్లుగీత సొసైటీలో సభ్యత్వము కలిగి యుండవలెను
6 లింగ మార్పిడి  (హిజ్రా) పింఛనులు 3000 18 సంవత్సరముల వయస్సు కలిగి హిజ్రా  (గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చిన) సర్టిఫికెట్ కలిగి యుండవలెను.
7 మత్యకారుల  పింఛనులు 2250 50 సంవత్సరముల వయస్సు కలిగి  మత్య శాఖ వారు జారీ చేసిన ఫిషర్ మెన్ సర్టిఫికెట్ కలిగి యుండవలెను.
8 ఒంటరి మహిళా  పింఛనులు 2250 1) ఒంటరి మహిళా  పింఛనుకు భర్త నుంచి విడాకులు తీసుకొని 35 (Urban/  Rural) సంవత్సరముల వయస్సు కలిగిఉండవలెను. తహసీల్దార్ గారు జారీ చేసిన ఒంటరిమహిళగా ద్రువీకరించు  పత్రము కలిగి ఉండవలెను.
2) పెళ్లికాని  ఒంటరిమహిళలు కూడా అర్హులు.   వీరు పట్టణ ప్రాంతములో  అయితే 35, గ్రామీణ ప్రాంతములో అయితే 30 సంవత్సరములు కలిగి తహసీల్దార్ గారు జారీ చేసిన ఒంటరిమహిళ  ధ్రువపత్రము కలిగి ఉండవలెను.
9 కిడ్నీ వ్యాధిగ్రస్తుల (Dialysis)  పింఛనులు 10000 కిడ్నీ వ్యాధిగ్రస్తులు వారు ఏ హాస్పిటల్ నుంచి వైద్యము పొందుచున్నారో  ఆ హాస్పిటల్ నుంచే వారి అప్లికేషన్ గవర్నమెంట్ కు పంపించవలసి ఉంటుంది.  వీరికి వయస్సుతో నిమిత్తము లేదు
10 డప్పు కళాకారుల  పింఛనులు 3000 50 సంవత్సరముల వయస్సు కలిగి డప్పు కళకారులై యుండవలెను.  మీ-సేవ ద్వారా వీరి అప్లికేషన్ ఆన్ లైన్ చేయించుకొనవలెను. ఈ పింఛనును సాంఘిక సంక్షేమ శాఖ వారు మంజూరు చేయుదురు.
11 చర్మకారుల పింఛనులు 2250 50 సంవత్సరముల వయస్సు కలిగి చర్మకారులై యుండవలెను.  మీ-సేవ ద్వారా వీరి అప్లికేషన్ ఆన్ లైన్ చేయించుకొనవలెను. ఈ పింఛనును సాంఘిక సంక్షేమ శాఖ వారు మంజూరు చేయుదురు.
12 ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పింఛనులు 2250 ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ప్రభుత్వ వైద్యశాలలోని  ఏ.ఆర్.టి. సెంటర్ నుండి 6 నెలలుచికిత్స పొందుచున్నచో వారి దరఖాస్తును ఏ.ఆర్.టి.సెంటర్ వారు  ప్రభుత్వమునకు పింఛనుకొరకు పంపించెదరు.

ఎంపిక విధానము:

అర్హత కలిగిన అభ్యర్థులు వారి దరఖాస్తులను గ్రామీణ ప్రాంతముల వారు, వారి పంచాయతీ కార్యాలయము నందుగాని, సంబంధిత మండలపరిషత్ అభివృద్ధి అధికారివారి కార్యాలయము నందుగాని సమర్పించవలసి యున్నది. పట్టణ ప్రాంతమువారు మునిసిపల్ కార్యాలయము నందు వారి దరఖాస్తులను సమర్పించవలసి యున్నది.అభ్యర్థులు వారి దరఖాస్తుతో పాటుగా సంబంధిత ధ్రువీకరణపత్రములను జత చేయవలయును. సంబంధిత అధికారులచే వారి యొక్క స్థితిగతులను క్షుణ్ణముగా పరిశీలించబడును.అర్హత కలిగిన దరఖాస్తులు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులచే లేదా మునిసిపల్ కమీషనర్ గార్లచే సంబంధిత వెబ్ సైట్ నందు నిక్షిప్తము చేయబడును.ప్రభుత్వమువారిచే జారికాబడిన రేషన్ కార్డు, భూమివివరములు, వాహన మరియు ఉద్యోగ వివరములను క్షుణ్ణముగా పరిశీలించిన పిదప నిబంధనలకు లోబడి మంజూరు చేయబడును. ఒక రేషన్ కార్డుకు, ఒక్క దరఖాస్తు మాత్రమే పరిగణనలోనికి తీసుకొనబడును.

పంపిణీ విధానము:
 •  ప్రభుత్వమువారిచే పింఛను సొమ్మును (మండల పరిషత్ అభివృద్ధి అధికారులచే లేదా మునిసిపల్ కమీషనర్ గార్ల ఖాతాకు) ప్రతి నెల 27వ తేది నుండి 30వ తేదీ లోపుగా నేరుగా జమచేయబడును.
 • ఇట్టి సొమ్మును, (మండల పరిషత్ అభివృద్ధి అధికారులచే లేదా మునిసిపల్ కమీషనర్ గార్లు సంబంధిత పింఛను పంపిణి అధికారిగార్లకు ఇవ్వడం జరుగుతుంది. పింఛను పంపిణి అధికారులు ఆ మొత్తమును మరియు Acquittence ప్రతినెలా 1వ తేదీ నుండి వారికి కేటాయించిన గ్రామములో లేదా వార్డులలో పంపిణి చేయుట జరుగును.
 • పింఛను పంపిణీ అధికారులు పింఛనుదారుని యొక్క వేలిముద్ర లేదా కంటిపాపముద్ర ద్వారా పింఛను పంపిణి చేయుదురు. పింఛనుదారుని యొక్క వేలిముద్ర లేదా కంటిపాపముద్ర గుర్తించని పింఛనుదారులకు తిరిగి 2 లేదా 3 పర్యాయములు పరీక్షించిన పిదప పింఛను పంపిణి అధికారి వారి బాధ్యతతో వారి చేతి వేలిముద్ర ద్వారా పింఛను పంపిణీ చేయుట జరుగును. ఇట్టి పింఛనుదారులు ఆధార్ కేంద్రమునకు వెళ్లి వారియొక్క వేలి ముద్రలు, కంటిపాపలను ఆధార్ నందు తిరిగి నమోదు చేయించుకొనవలెను.
 •  ప్రతి నెల పింఛను 1 వ తేదీ నుండి 5 వ తేదీ వరకు పంపిణి చేయవలయును.
 • వృధాప్య పింఛను తీసుకొంటూ ఆ పింఛను దారుడు చనిపోయిన యడల అతని భార్యకు వితంతువు పింఛను మంజూరు చేయబడును.  ఇట్టి దరఖాస్తును 3 నెలల లోపుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులచే లేదా మునిసిపల్ కమీషనర్ గార్లుకు  దరఖాస్తు సమర్పించ వలసియున్నది.
 • డయాలసిస్ (3, 4 మరియు 5 స్టేజీలలో ) చేయించు కొంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు వారు చికిత్స పొందుతున్న హాస్పిటల్ నందు వారి బయోమెట్రిక్ ద్వారా అదే హాస్పిటల్ లోని ఆరోగ్యశ్రీ నుండి దరఖాస్తు చేసుకొనవలసియున్నది.   ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న వారికి వారి బ్యాంకు ఖాతాలో పింఛనుసొమ్ము జమ చేయబడును. ప్రవేట్ ఆసుపత్రి నందు వైద్యము పొందుతున్నవారికి సంబంధిత పింఛను పంపిణీ అధికారి ద్వారా పంపిణి చేయబడును.
 • ఎయిడ్స్ (హెచ్.ఐ.వి) వ్యాధిగ్రస్తులు ప్రభుత్వ వైద్య శాలలోని  ఏ.ఆర్.టి.సెంటర్ నుండి 6 నెలలుమించి చికిత్స పొందుచున్నచో వారి దరఖాస్తును ఏ.ఆర్.టి.సెంటర్ వారు ప్రభుత్వమునకు పింఛను కొరకు పంపించవలయును. అట్టి పింఛను ప్రభుత్వము మంజూరు చేసిన పిదప వారి బ్యాంకుఖాతాలో పింఛను సొమ్ము జమచేయబడును.
 • అర్హత కలిగిన డప్పుకళాకారులు మరియు చర్మకారులువారి దరఖాస్తులను మీ-సేవా కేంద్రం ద్వారా నమోదు చేసుకొనవలెను. అట్టి దరఖాస్తులను సాంఘికసంక్షేమశాఖ వారిచే క్షుణ్ణముగా పరిశీలించిన పిదప మంజూరు చేయబడును.
నిధుల విడుదల:

ప్రతి నెల నిధులను నేరుగా (ఇఎఫ్‌ఎంఎస్) ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఎంపిడిఓలు / మునిసిపల్ కమిషనర్లు వైయస్ఆర్ పెన్షన్ ఖాతాలకు సిఇఒ, ఎస్‌ఇఆర్‌పి, విజయవాడ నుండి విడుదల చేస్తున్నారు.

2. సంస్థాగత నిర్మాణము :

10 నుండి 15 మంది పేద మహిళలు ఒక SHG (డ్వాక్రా సంఘం) గా ఏర్పడి వారి సామాజిక, ఆర్ధిక ఉన్నతి కోసం కృషి చేయడమే ఈ ఉద్యమం లక్ష్యం. జిల్లాలో 60,592 స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగినది. సభ్యుల సంఖ్య : 6,14,769. గ్రామైఖ్య సంఘాలు : 2,287 ఉన్నాయి.

3. బ్యాంకు లింకేజి :

నిరుపేదలైన డ్వాక్రా గ్రూప్ సభ్యులకు సంఘానికి Rs. 7.00 లక్షల నుండి Rs. 10.00 లక్షల వరకు రుణ సదుపాయము బ్యాంకులు కలుగ చేయుచున్నారు. సక్రమముగా చెల్లించిన సంఘానికి వడ్డీరాయితీ సౌకర్యం కలగ చేసినారు. బ్యాంకు వారు సం..నికి 7% (రూ.3 లక్షల ఋణంవరకు) వడ్డీతో ఋణ సదుపాయం కల్పిస్తూ డ్వాక్రా సభ్యులు ఆర్ధికంగ అభివృద్ధి చెందటానికి వీలుకల్పించడం జరుగుచున్నది. ఈ విధంగా 2018-19 సంవత్సరానికి జిల్లాలో ఉన్న 41715 గ్రూపులకు రూ.1647.00 కోట్లు ఇవ్వడం జరిగినది.

4. స్త్రీ నిధి :

AP Cooperative Societies Act 1964 కింద 2011 సం:లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ పధకం క్రింద ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలికి ప్రతినెల కుటుంబ ఆదాయం కనీసం Rs.10000/- లు చేకూరాలనెది ప్రభుత్వ సంకల్పం. దీని ద్వారా జీవనోపాదుల ఋణాలను ప్రతి సభ్యురాలికి Rs.25000/- నుండి Rs.100000/- ల వరకు దరఖాస్తు చేసిన 48 గం:లలో రుణాలు మంజూరు చేయడం జరుగుచున్నది. సంఘ సభ్యుల ముఖ్యమైన అవసరాలకు 24 గంటల వ్యవధిలో చిన్న వ్యాపారాలకు

అర్హతలు:
 • గ్రూపు online నందు నమోదు కాబడి వుండాలి.
 • గ్రూపు బ్యాంకు నందు సక్రమంగా అప్పు తీసుకొని, చెల్లిస్తూ వుండాలి. సక్రమమైన పొదుపులు కలిగి వుండాలి.
 • స్త్రీనిధి నందు పొదుపులు/డిపాజిట్ చెల్లించాలి.
 • గ్రూపు నందు అప్పు అవసరాలు కలిగిన సభ్యులు, తీసుకునే అప్పు సక్రమంగా ఆదాయ పెంపు కార్యక్రమాలపై లేదా కుటుంబ సామజిక అవసరాలపై వినియోగించుకోవడానికి అంగీకరించాలి.
 • గ్రూపు “A లేదా B” గ్రేడ్ నందు వుండాలి.
అప్పు మంజూరు, చెల్లింపు విధానం:
 • గ్రూపు సభ్యుల ద్వారా MCP/ స్త్రీనిధి ఋణ దరఖాస్తు పూర్తిచేయాలి.
 • సంబందిత గ్రామ సంఘం (వి.వో) ధృవీకరించాలి.
 • సంబందిత సి.సి., ఏ.పి.యం మరియు ఏ.సి. లు పరిశీలించి online ద్వారా అప్లోడ్ చేయాలి.
 • అప్పు మంజూరు వి.వో. ద్వారా గ్రూపు పొదుపు ఖాతాకు నేరుగా జమ చేయబడుతుంది.
 • తీసుకొన్న అప్పు తిరిగి 24 వాయిదాలలో, వి.వో. స్త్రీనిధి ఖాతా కు దానిద్వారా స్త్రీనిధి ఖాతాకు చెల్లించాలి.
 • సక్రమమైన చెల్లింపులు ఉంటే వడ్డీ మాఫీ (VLR) పధకం వర్తిస్తుంది.
5. జీవనోపాదులు
వ్యవసాయ సంబందిత జీవనోపాదులు:
అర్హతలు :
 • మహిళ గ్రూపులలో సభ్యులై వుండాలి.
 • APRIGP కార్యక్రమంలో సన్న చిన్నకారు మరియు వ్యవసాయ కూలీలలో ఏర్పాటు చేయబడిన FPG లు కూడా ఆ కార్యక్రమం లో అర్హులు.
 • గ్రూపు సక్రమం గా పొదుపులు, అప్పులు తీసుకొంటూ, చెల్లిస్తూ వుండాలి.
 • Online నందు గ్రూపు నమోదు కాబడి వుండాలి
ప్రయోజనాలు:
 • వ్యవసాయ సంబందిత ప్రభుత్వ పధకాల తో సమన్వయం చేసుకొంటూ, ఆ పధక ప్రయోజనాలకు అనుబంధంగా ఋణ సదుపాయం కల్పించడం.
 • వ్యవసాయ పెట్టుబడులు, వ్యవసాయ సంబందిత యూనిట్ ల ఏర్పాటులో ఆర్ధిక, నైపుణ్యాల పెంపుదల కార్యక్రమాలలో చేయూత నివ్వడం.
 • ఉదాహరణకు: పశువుల కొనుగోలు, గొర్రెపిల్లల పెంపకం, సైలేజ్ తయారీ, కోడిపిల్లల పెంపకం, సమిష్టి విత్తన కొనుగోళ్ళు, సమిష్టి పంట ఉత్పత్తుల అమ్మకం, గ్రామీణ గోదాముల ఏర్పాటు, వ్యవసాయ అనుబంద ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు మొదలగునవి.
 • స్త్రీనిధి, ఉన్నతి, బ్యాంకు లింకేజ్ కార్యక్రమాల ద్వారా ఋణ మంజూరు లో సమన్వయం ఏర్పాటు చేయడం.
వ్యవసాయేతర జీవనోపాదులు :
అర్హతలు:
 • మహిళ గ్రూపులలో సభ్యులై వుండాలి.
 • గ్రూపు సక్రమం గా పొదుపులు, అప్పులు తీసుకొంటూ, చెల్లిస్తూ వుండాలి.
 • Online నందు గ్రూపు నమోదు కాబడి వుండాలి.
 • గ్రూపు సభ్యులు సమిష్టిగా లేదా వ్యక్తిగతంగా చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు ఏర్పాటు కు ఆసక్తి కలిగి వుండాలి.
ప్రయోజనాలు:
 • ప్రభుత్వ పధకాల తో సమన్వయం చేసుకొంటూ, ఆ పధక ప్రయోజనాలకు అనుబంధంగా ఋణ సదుపాయం కల్పించడం.
 • సంబందిత యూనిట్ ల ఏర్పాటులో ఆర్ధిక, నైపుణ్యాల పెంపుదల కార్యక్రమాలలో చేయూత నివ్వడం.
 • స్త్రీనిధి, ఉన్నతి, బ్యాంకు లింకేజ్ కార్యక్రమాల ద్వారా ఋణ మంజూరు లో సమన్వయం ఏర్పాటు చేయడం.
 • డ్వాక్రా స్టాల్స్, సారస్ ఎక్సిబిషన్ ల ద్వారా, మార్కెటింగ్ సదుపాయాల కల్పనకు చేయుట ఇవ్వడం.
 • APRIGP మండలాలలో రూరల్ రిటైల్ చైన్స్ ద్వారా సమిష్టి కొనుగోళ్ళు చేపట్టడానికి తద్వారా కొనుగోలు ఖర్చులు, రవాణా ఖర్చులు తగ్గించడం.
6. ఉన్నతి (యస్.సి.యస్.పి & టి.యస్.పి):

‘ఉన్నతి’ కార్యక్రమం ద్వార షెడ్యూల్ కులాలు / షెడ్యూల్ తెగలు కుటుంబాల మహిళా సభ్యులకు సబ్ ప్లాన్ నిధుల ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఋణాలు ఇవ్వడం జరుగుతున్నది. Ex: పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కిరాణా వ్యాపారం, బట్టల వ్యాపారం మరియు ఇతర వ్యాపారాలకు ఈ రుణాలు వడ్డీ లేకుండా పొందవచ్చును.
2018-19 సం..నికి (SCSP) రూ. 7.22 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా రూ.7.26 కోట్లు వివిధ జీవనోపాదులకు మంజూరు చేసినారు. టిఎస్ పి కి సంబందించి రూ.2.43 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.2.26 కోట్లు ఇవ్వడం జరిగినది.

అర్హతలు:
 • సంఘం సభ్యురాలు అయి వుండాలి.
 • సంఘంలొ సక్రమముగా పొదుపు చేస్తూ వుండాలి.
 • యస్.సి లేక యస్.టి సభ్యురాలు అయి వుండాలి.
 • జీవనోపాదులు ఏర్పాటు చేయువారు అయి వుండాలి.
 • గ్రూపు online నందు నమోదు చేయబడి వుండాలి.
ప్రయోజనాలు:
 • జీవనోపాదులు ఏర్పాటు చేసుకొవచ్చు.
 • నెలవారి ఆధాయం పెంపొందించవచ్చు.
 • లైవ్ జివనోపాదులకు రిస్క్ సదుపాయం ఉచితంగా ఏర్పాటు వుంటుంది.
 • కుటుంబ అవసరాలకు అప్పు పొందవచ్చు.
7. పాడి గేదల పెంపకం :

బ్యాంకు లింకేజి, స్త్ర్హీ నిధి, ఎస్ సి. టిఎస్ పి నిధులతో డ్వాక్రా గ్రూప్ సభ్యులకు పాడి గేదలు పంపిణి చేసి వారియొక్క జివనోపాదిని పెంపొందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుచున్నది. ఒక గేద యూనిట్ విలువ రూ.50,000/- దీనిలో సబ్సిడీ ఏమియూ లేదు.

8. అవెన్యూ ప్లాంటేషన్ (రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం) :

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం అనుసంధానంతో అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమం క్రింద ఒక కిలోమీటర్కు 400 మొక్కలు చొప్పున (నీడనిచ్చేవి + పండ్లు ఇచ్చేవి) గ్రామంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటిమ్చడం ఈ పధకం లక్ష్యం.

9. పండ్ల తోటల పెంపకం :

సెర్ప్ మరియు NREGS అనుసంధానంతో SC/ST మరియు సన్న , చిన్నకారు రైతుల భూములలో పండ్ల తోటల పెంపకం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడం ఈ పధకం లక్ష్యం.

10. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు :

రైతు ఉత్పత్తిదారుల సంఘం అనేది 20 మంది లోపు సభ్యులతో ఏర్పాటు అయ్యే ఒక అనధికార సంఘం. ఈ విధంగా ఏర్పాటు అయిన 100 నుండి 150 వరకు ఉన్న సంఘాలను కలిపి రైతు ఉత్పత్తి దారుల సంస్థగా నమోదు చేయబడుతుంది. ఈ ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులందరూ ఉత్పత్తి చేసే పంటలకు వ్యవసాయ రుణాలు, పంటల భీమ, విత్తనా రాయితీలు మరియు మార్కెటింగ్ సౌకర్యం కలుగ చేయడం దీని ఉద్దేశ్యం. ఈ పధకం జిల్లాలోని 11 APRIGP మండలాలలో అమలుజరుచున్నది. చేపడుతున్న కార్యక్రమాలు.

 • వ్యవసాయ భూమికి సంబంధించిన రికార్డ్స్ లో సమస్యలు పరిష్కరించుట.
 • రుణ సదుపాయం పొందటం.
 • మెరుగైన ఉత్పత్తి పద్ధతులు అమలు చేయుట.
 • ఉత్పాదకత పెంపునకు శిక్షణలు /సాంకేతిక సహాయం ఇవ్వడం.
11.రూరల్ రిటైల్ చైన్స్ :

ప్రతి గ్రామంలో 4 – 5 కిరాణా షాపులు గ్రామ ప్రజలకు రోజువారిగా అవసరం అయ్యే సరుకులు అందిస్తూఉంటాయి. ఇలా గ్రామీణ సంఘ సభ్యులు నడుపుతున్న ఒక కిరాణా షాపును APRIGP లోని రూరల్ రిటైల్ చైన్స్ ప్రాజెక్ట్ లో భాగంగా గుర్తించి, మెరుగు పరిచి, సంఘటిత పరచడం వలన ఏర్పడిన మార్ట్ ల సంఘం ద్వారా సంఘ సభ్యులైన ఉత్పత్తిదారులకు మార్కెటింగ్ సౌకర్యం కలిగిస్తూ, ఇతర సరుకులను సంఘటితముగా కొనుగోలు చేయడం ద్వారా సంఘ సభ్యులైన వెంయోగాదరులకు తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందిచబడతాయి. ఈ విధంగా గ్రామీణ సంఘ సభ్యుల కిరాణా షాపులను గుర్తించి, సంఘటిత పరిచి మండల స్థాయిలో మండల నోడల్ స్టోర్ (MNS) ఏర్పాటు చేయబడుతుంది. ఈ మండల నోడల్ స్టోర్ ను తప్పక APMACS Act 1995 నందు రిజిస్టర్ చేయబడుతుంది.

Rural Retail Chain (RRC)
 • APRIGP మండలాలల్లోని చిన్న కిరణా వర్తకులను గుర్తించి వారిని మండల స్థాయిలో ఒక సొసైటీ గా ఏర్పాటు చేయుట.
 • మండల నోడల్ స్టోర్స్ (MNS) ద్వారా చిన్న కిరణా వర్తకులకు మంచి నాణ్యమైన ఉత్తత్తులను మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు అందించుట.
 •  ప్రతి నెల మండల నోడల్ స్టోర్స్ ను GST ఆడిట్ చేయించుట, కిరణా వర్తకులకు తగు శిక్షణలు, ఎక్స్ పోజర్ విజిట్స్ చేయించుట.
 •  ప్రతి మండల నోడల్ స్టోర్స్ నందు పత్రి నెల 3.50 లక్షల కనీసం అమ్మకం చేయించవలసి ఉన్నది.
కావలసిన సహాకారం:
 •  ప్రముఖ కంపెని వారితో టై అప్ చేయించుట మరియు కంపెనిస్ వారు డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చే మార్జిన్స్ మన మండల నోడల్ స్టోర్స్ కు కుడా ఇస్తే బాగుంటుంది. తద్వారా అమ్మకాలు పెంచే అవకాశం ఉంటుంది.
 • మేబిలిటి ఉన్న గ్రామాలకు రవాణా ఖర్చు నిమిత్తం 50:50 షేర్ పధ్ధతి లో అమ్మకాలు జరుపుకునే విధంగా అనుమతి మంజూరు చేయుట.
 • మండలాల్లో పనిచేయుచున్న సిబ్బంది మరియు SHG సభ్యులతో నెలవారీ సరుకులు మన మండల నోడల్ స్టోర్స్ నందు కొనుగోలు చేయు విధంగా సిబ్బంది సహాకారం.
 • డీలర్లుడైరెక్ట్ గా రిటైల్ వ్యాపారం చేయుట మరియు మన కిరాణా వరక్తులకు ౦% బిజినెస్ (with out bill) ను కంట్రోల్ చేయగల్లుట.
12.వై.ఎస్.ఆర్. పెళ్లి కానుక :

రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్లల వివాహ కార్యక్రమం భారం కాకుండా మరియు పెళ్లి కుమార్తె పెళ్లై అత్తవారింటికి వెళ్ళిన తరువార కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు గాను పెళ్లి కనుక పధకము అమలు చేయుచున్నారు. ఈ పధకం ద్వారా పేదింటి ఆడపిల్లలకు సహాయం చేయడం ద్వారా అండగా ఉండటమే కాక బాల్య వివాహాలు నిలుపుదల చేసేందుకు మరియు వివాహం రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వధువుకి రక్షణ కల్పించడం పెళ్ళికానుక పధకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఈ పధకం ప్రారంభం ముందు దుల్హన్, గిరిపుత్రిక, ఎస్.సి వివాహ ప్రొత్సాహక పధకం, కులాంతర వివాహ ప్రొత్సాహక పధకం, బి.సి వివాహ ప్రొత్సాహక పధకం, ఎస్.టి కులాంతర వివాహ ప్రొత్సాహక పధకం, విభిన్న ప్రతిభావంతులకు వివాహ ప్రొత్సాహక పధకం మరియు ఇతర భవన నిర్మాణ కార్మికులకు పెళ్ళి కానుక ఆంద్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బొర్డు వారి పెళ్ళి కానుక వంటి వివాహ ప్రొత్సాహక పధకాలు అమలులొ ఉన్నవి.
పై ప్రొత్సాహక పధకాలు గురించి అందరికి అవగాహన లేకపొవటం, వేరే వేరే ప్రదేశాలకు వెళ్లవలసి రావటం, ప్రొత్సాహకాలు మఁజూరు లొ జాప్యం, డిజిటలైజేషన్ లేకపొవటం, పటిష్టమైన పరిహార యంత్రాంగం (గ్రీవెన్స్) లేకపొవటం అనే ఇబ్బందులు అధిగమించటానికి ఒకే వేదిక (single desk) విధానం తీసుకువచ్చారు. దినివలన ఈ క్రింది ప్రయోజనాలు వున్నాయి.

పధకం నమోదు:

ఈ పధకం గ్రామీణ ప్రాంతాలవారు మండల కేంద్రాలలోని వెలుగు కార్యాలయాలలో మండల మహిళా సమాఖ్య ల ద్వారా అర్బన్ నందు మెప్మా ఆఫిసు ద్వారా ఉచితంగా నమోదు చేసుకొవచ్చు. నమోదు చేసిన వెంటనే అప్లికేషను ID నెంబర్ అభ్యర్ధుల మొబైల్ నెంబర్ కు వస్తుంది. అనంతరం కళ్యాణ మిత్రాలు వచ్చి వివరాలు సేకరించి , దర్యాప్తు చేస్తారు. అ తర్వాత ముందుగ రావాల్సిన 20 శాతం నగదును పెళ్ళికూతురు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

అర్హతలు:
 • వివాహానికి 15 రోజులు ముందు దరఖాస్తు చేసుకోవాలి.
 • పెళ్ళి తేదినాటికి పెళ్ళి కుమార్తె వయస్సు 18 సంవత్సరాలు, పెళ్ళి కుమరుని వయస్సు 21 నిండి వుండాలి.
 • ఆంద్రప్రదేశ్ నందు ప్రజా సాధికర సర్వే జాబితాలొ నమోదై ఉండవలెను. ఒకవేళ నమోదు కాకపొతే నమోదు చేసుకొవలెను.
 • మొదటి వివాహం చేసుకునే వారు మాత్రమే అర్హులు.
 • భర్త చనిపొయిన వితంతువులు (ఆడవారు) మాత్రమే రెండవ వివాహానికి అర్హులు.
 • వివాహం ఆంద్రప్రదేశ్ రాష్ట్రములొ మాత్రమే జరుగవలెను.
 • వదువు తప్పనిసరిగా ఆంద్రప్రదేశ్ వాసులై వుండాలి వరుడు ఆంద్రప్రదేశ్ తొ పాటుగా ఐదు రాష్టాలు తెలంగాణ, కర్ణాటక, చత్తిష్ ఘడ్, ఒరిస్సా మరియు తమిళనాడు మరియు పాండిచ్చేరి నందు యానాం వారు అర్హులు.
 • దరఖాస్తు చేసుకునే సమయానికి, వివాహం తేది మరియు వివాహా వేదిక నిర్ణయించి ఉండవలెను.
 • ప్రస్తుతం వదువు/వరుడు కు విద్య అర్హతలపై నిబందనలు లేవు.
ప్రయోజనాలు:

బి.సి. కులాంతర వివాహాల కుప్రోత్సాహం రూ. 50,000/-

యస్.టి / యస్.సి కులాంతర వివాహలకు ప్రోత్సాహం రూ. 75,000/-
యస్.సి. వివాహల కు ప్రోత్సాహం రూ. 40,000/-
యస్.టి వివాహలకు ప్రోత్సాహం రూ. 50,000/-
బి.సి వివాహల కు ప్రోత్సాహం రూ. 35,000/-
మైనారిటి (దుల్హన్) వివాహల కు ప్రోత్సాహం రూ. 50,000/-
విభిన్న ప్రతిభావంతులకు వివాహల కు ప్రోత్సాహం రూ. 1,00,000/-
13. వై.ఎస్.ఆర్. ఆసరా :

స్వయం సహాయక బృందాలలో నమోదైన మహిళ పొడుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దశలుగా ప్రభుత్వమే నేరుగా చెల్లించడం జరుగుతుంది. సున్నా వడ్డికే ఋణాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఋణాల తాలుకూ వడ్డీని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది.

అర్హతలు:
 • ప్రతి గ్రూపుకు ది. 11/4/2019 నాటికి బ్యాంకు నందు అప్పు తీసుకుని, అప్పు నిల్వ వుండాలి.
 • తీసుకున్న అప్పు ప్రతి నెల సక్రమమైన వాయిదాలు చెల్లింపు చేస్తూ వుండాలి.
అమలు చేయు విధానం:
 • ది. 11/4/2019 వ తేది నాటికి అప్పు నిల్వ వున్న గ్రూపుల వారిగా సంబంధిత మండల ఏ.పి.యం లాగిన్ నందు ముందుగా పొందుపరచిన సర్టిఫికెట్ జనరేట్ చేసుకొవాలి.
 • సంబంధిత బ్యాంకు మేనేజర్ చేత వున్న అప్పు నిల్వను ద్రువీకరించాలి.
 • సంబంధిత సంఘం లీడర్ల చేత, మండల ఏ.పి.యం చేత దృవీకరణ చేయాలి.
 • దృవికరణ చేసిన సర్టిఫికెట్ ఐ.బి సైట్ నందు మండల ఏ.పి.యం లాగిన్ నందు అప్లొడ్ చేయవలెను.
 • ఆ విధంగా అప్లొడ్ చేసిన సర్టిఫికెట్ యొక్క వివరాలు ఏ.సి లాగిన్ నందు వెరిఫికేషన్ చేయాలి.
 • వెరిఫికేషన్ నందు ఖచ్చితమైన సర్టిఫికెట్ లు మాత్రమే అప్రూవల్ యివ్వాలి. లెని వాటిని రిజెక్ట్ చేయాలి.
 • రిజెక్ట్ అయిన వాటిని మరల సరిచూసి మరల ఏ.పి.యం లాగిన్ నందు అప్లొడ్ చేయాలి.
ప్రయోజనాలు:
 • ది. 11/4/2019 వ తేది నాటికి గ్రూపు కి వున్న బ్యాంకు ఆప్పు నిల్వ మొత్తాన్ని 4 వాయిదాలలో ప్రభుత్వం తిరిగి గ్రూపు బ్యాంకు ఖాతాకు జమ చేయుట ద్వారా రుణ మాఫీ చేయుట.
14. వై.ఎస్.ఆర్ భీమా :

ఈ పధకం క్రింద ప్రతి జిల్లాలో కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయబడి 155214 అనే నెంబర్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సంఘటన నమోదైన 24 గం:ల లోపు తక్షణ సహాయంగా Rs.5000/- లు చెల్లింపు.

YSR భీమా (సామజిక భద్రత):
అర్హతలు:
 • నెలకు రూ.15,000/- లోపు ఆదాయం కలిగి వుండాలి.
 • వ్యవసాయ, భవన నిర్మాణ లేదా ఇతర అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికులు.
 • 18 నుండి 75 సంవత్సరాల లోపు వయస్సు కలిగినవారు.
 • తప్పనిసరిగా ప్రజాసాధికార సర్వే నందు నమోదు కాబడినవారు.
ప్రయోజనాలు:
 • ప్రమాదవుశాత్తు మరణం మరియు పూర్తి అంగవైకల్యం సంబంవించిన వారికి వయస్సు 18–70 సంవత్సరాల వారికి – రూ 5 లక్షలు.
 • పాక్షిక అంగవైకల్యం సంబంవించిన వారికి వయస్సు 18–70 సంవత్సరాల వారికి – రూ 2.50 లక్షలు.
 • సాధారణ మరణం సంబవించిన వారికి వయస్సు 18 – 50 సంవత్సరాల వారికి – రూ 2 లక్షలు.
 • సాధారణ మరణం సంబవించిన వారికి వయస్సు వయస్సు 50–59 సంవత్సరాల లొపు వారికి – రూ. 0.30 లక్షలు.
 • కుటుంబం లోని ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 1,200/- స్కాలర్ షిప్ సదుపాయం.
వై.ఎస్.ఆర్ అభయహస్తం:

60 సం:లు దాటిన వారికి నెలకు కనీసం రూ.500/- సదుపాయం కలుగ చేయడం ఉద్దేశ్యం. ఈ పధకం లో చేరే మహిళలు చనిపోతే రూ.30 వేలు, ప్రమాదంలో చనిపోతే రూ.75 వేలు , అంగవైకల్యానికి గురైతే రూ.75 వేలు , పాక్షిక అంగవైకల్యం గురైతే రూ.౩7500/- ఆమె కుటుంబ సభ్యులకు అందచేయనున్నారు.
8, 9, 10, ఇంటర్ చదువుతున్న పిల్లలుంటే ఏటా రూ.1200/- చొప్పున స్కాలర్షిప్ లు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ పధకం లో చేరాలంటే ప్రజసాదికర సర్వేలో కచ్చితంగా నమోదై ఉండాలి. డ్వాక్రా సంఘ సభ్యురాలై ఉండి దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి.

 1. కాల్ సెంటర్ నందు క్లెయిమ్ నమోదు చేయడం.
 2. బీమా మిత్ర లకు క్లెయిమ్ వివరాలు తెలియజేయడం, తక్షణ సహాయం రూ.5000/-లు చెల్లించిన వివరాలు తీసుకొని అప్డేట్ చేయడం.
 3. బీమా మిత్రాల బ్యాంకు ఖాతా లకు తిరిగి రూ.5000/-లు జమ చేయడం.
 4. అభయ హస్తం, పశుబీమా, స్త్రీనిధి క్లెయిమ్స్ నమోదు చేయడం.
 5. వై.యస్.ఆర్ బీమా, అం అద్మి,అభయ హస్తం, పశుబీమా, స్త్రీనిధి క్లెయిమ్స్ అప్లోడ్ చేయడం కొరకు ఫాల్ అప్ చేయడం.
 6. బీమా మిత్రాలు అప్లోడ్ చేసిన క్లెయిమ్ డాకుమెంట్స్ పరిశీలించి, ఇన్సూరెన్స్/కార్మిక శాఖ వారికి పంపించడం.
 7. యాక్సిడెంటల్ క్లెయిమ్స్ కు సంబంధించిన పెండింగ్ డాకుమెంట్స్ కొరకు నామిని లతోనూ, బీమా మిత్రాలతోనూ మాట్లాడడం.
 8. CCRB/DCRB/RCRB వారితో పెండింగ్ డాకుమెంట్స్ గురించి మాట్లాడి వాటి అప్లోడ్ చేయడం.
 9. అవసరమైన డాకుమెంట్స్ కొరకు పంచాయితీ సెక్రటరిలతో మాట్లాడి వాటి అప్లోడ్ చేయడం.
 10. వై.యస్.ఆర్ అభయ హస్తం పధకం నందు 60 సం లు నిండిన సభ్యురాలికి పెన్షన్ కొరకు డాకుమెంట్స్ అప్డేట్ చేయించడం.
 11. వై.యస్.ఆర్ అభయ హస్తం పధకం నందు పెన్షన్ రిజెక్ట్ అయిన సభ్యురాలి ఆధార్, బ్యాంకు ఎకౌంటు అప్డేట్ చేయించడం.
 12. వై.యస్.ఆర్ అభయ హస్తం పధకం లో 3 సంలు ప్రీమియం చెల్లించని సభ్యుల నుండి బ్యాంకు వివరాలు సేకరించి తిరిగి వారి ఖాతాలకు ప్రీమియం జమ చేయించడం.
 13. అభయ హస్తం, పశుబీమా, స్త్రీనిధి క్లెయిమ్స్ అప్లోడ్ చేయించడం.
 14. స్వావలంబన పధకం నందు మరణిoచిన లేదా 60 సం లు నిండిన వారి నుండి వ్యక్తిగత వివరాలకు సంబందించిన డాకుమెంట్స్ తీసుకొని వారి బ్యాంకు ఖాతాలకు కార్పస్ మొత్తాన్నిజమ చేసేలా చూడడం.
 15. స్త్రీ నిధి సురక్షా నందు నమోదు చేసిన క్లెయిమ్స్ అప్లోడ్ చేయడం.
 16. వై.యస్.ఆర్ బీమా లో మరణించిన వారికి పెద్ద కర్మ రోజే CM ప్రోసిడిoగ్ లెటర్ ను బీమా మిత్ర ద్వారా నామిని కి అందజేసేలా చూడడం, సేర్మని ఫోటోస్ అప్లోడ్ చేయించడం.
 17. నామిని బ్యాంకు అకౌంట్స్ అప్లోడ్ చేయించడం, వాటిని పరిశీలించి అప్డేట్ చేయడం.
 18. ఫైనల్ అమౌంట్ రిజెక్ట్ అయిన బ్యాంకు ఎకౌంటు స్థానంలో నామిని కి సంబందించిన క్రొత్త బ్యాంకు ఖాతా ను అప్లోడ్ చేసేలా ఫాలో అప్ చేయడం.
 19. వై.యస్.ఆర్ బీమా కాల్ సెంటర్ నందు జరిగే లావాదేవీలను రికార్డ్స్ నందు నమోదు చేయడం.
 20. క్లెయిమ్ డాకుమెంట్స్ అన్ని కాంప్యాక్టర్ నందు భద్రపరచడం.
 21. మెరుగైన ఫలితాలు సాధించాలంటే మిగిలిన లైన్ డిపార్ట్మెంట్ వారితో నెల వారిగా మీటింగ్స్ ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్ వారిగా ఒక స్టాఫ్ కు భాద్యత అప్పగించడం.
 22. చనిపోయిన వెంటనే కాల్ సెంటర్ కు ఫోన్ చేసేలా కాల్ సెంటర్ నెంబర్ ను ప్రచారం చేయడం. టెలిపోన్ ఆపరేటర్లు గా పని చేయుచున్న వారు మంచి కంప్యూటర్ నైపుణ్యాలు కల్గిన వారు ఉండాలి.
15. దీన్ దయాళ్ – ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన : (DDU-GKY)

ఈ పధకం క్రింద గ్రామీణ యువతకు , మహిళలకు వివిధ రంగాలలో నైపుణ్యాలను పెంపొందించుకొనుటకు అవసరమైన శిక్షణను 2 నుండి 6 నెలలపాటు ఆయా శిక్షణా కేంద్రాలలో శిక్షణ ఇవ్వడం, శిక్షణా అనంతరం కనీసం నెలకు Rs.6000/- లు జీతం లభించే విధంగా ఉపాధిని చూపించడం జరుగుచున్నది.
2018-19 సం..నికి (SCSP) రూ. 7.22 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా రూ.7.26 కోట్లు వివిధ జీవనోపాదులకు మంజూరు చేసినారు. టిఎస్ పి కి సంబందించి రూ.2.43 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.2.26 కోట్లు ఇవ్వడం జరిగినది.

సంప్రదించవలసిన వివరాలు:
Sl. No. Name of the Officer Division / Mandal attached Landline
1 ఎమ్ . శ్రీనివాస రావు పథక సంచాలకులు 08672-252471
ఇమెయిల్ :-

drdavelugukrishna[at]gmail[dot]com

 ముఖ్యమైన లింకులు:
1 YSR PENSION KANUKA https://www.sspensions.ap.gov.in
2 YSR Pellikanuka https://chpk.ap.gov.in/CPkDashboard/index.html
3 Bank Linkage https://www.ikp.serp.ap.gov.in/BPAP/view/shared/home.aspx
4 Streenidhi https://www.sthreenidhi.ap.gov.in/SNBank/UI/Home.aspx
5 Livelihoods https://www.ikp.serp.ap.gov.in/APMAS/UI/Login.aspx