ముగించు

ముఖ్య ప్రణాళిక అధికారి

ముఖచిత్రము

శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ:

జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భారత ప్రభుత్వము/రాష్ట్ర ప్రభుత్వముచే రుపొందినచినడిన వివిధ రంగాల యొక్క గణాoకాల సేకరణ, సంగ్రహణ మరియు విశ్లేషణలో పాల్గోనును. ఈ గణాoకాలను ప్రజల సంక్షేమము కొరకు వివిధ పధకాలు మరియు ప్రణాళికలు సూత్రీకరించుటలో ప్రభుత్వమునకు సహాయపడును.

సంస్థాగత నిర్మాణ క్రమము

జిల్లా అధికారుల నుండి దిగువ స్థాయి అధికారుల సంస్థాగత నిర్మాణ క్రమము:

Organogram_CPOKRI

పధకాలు/కార్యకలాపాలు/కార్యప్రణాళిక:

వ్యవసాయ గణాంకములు:
(I)వర్షపాతం:

మండలానికి ఒకటి చొప్పున 49 మండలాలలో 49 రెవిన్యూ వర్షమాపక కేంద్రాలు కలవు. ప్రభుత్వము ఉత్తర్వులు ననుసరించి గ్రామీణ మరియు పట్టణ రెవిన్యూ కార్యాలయములో గల 49 రెవిన్యూ వర్షమాపక కేంద్రాల నుండి దిన/ వారపు/ నెలవారీ వర్షపాత గణాంకాలను సేకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు వాతావరణ కేంద్రము, హైదరాబాదు (ఎoచుకున్న కేంద్రాలకు) నకు పంపబడును. జిల్లాలో 151 ఎ.డబ్ల్యూ.ఎస్. వర్ష పాత కేంద్రములు కలవు. జూన్ 2014 నుండి అధికార ప్రయోజనము కొరకు 151 ఎ.డబ్ల్యూ.ఎస్. వర్షమాపక కేంద్రాల వర్ష పాత వివరములు తహసీల్దార్లుకు అందరు తెలియజేయబడుచున్నది. www.apsdps.ap.gov.in కు లాగిన్ అయినచో ఈ ఇంటిగ్రేటెడ్ వర్షపాతము యొక్క వివరములు తెలుకొనవచ్చును.

(ii)ఋతువు మరియు పంట పరిస్థితి నివేదిక:

వర్షపాతము, ప్రతీ వారపు/నెలవారీ ఋతువు మరియు పంట పరిస్థితి నివేదికను, పంటల వారీగా నాటిన వివరములను సేకరించి రాష్ట్ర ప్రభుత్వమునకు పంపిoచబడును.

(iii)వ్యవసాయ గణన:

ఖరిఫ్ సీజన్/ రబీ సీజనలలో సాగునీటి సదుపాయము కలిగిన మరియు సాగునీటి సదుపాయము లేని వివిధ పంటల తుది గణాంకాలను ప్రతి రెవిన్యూ గ్రామము నుండి సేకరించి, మండల, డివిజినల్ మరియు జిల్లా సంగ్రహ పట్టికలు తయారు చేయబడును. ప్రతీ సంవత్సరము ఈ రెండు సీజనలకు సంబంధించిన మండలాల వారీగా సంక్షిప్తము చేయబడిన జిల్లా సంగ్రహ పట్టికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు సమర్పిచబడును.

(iv)ప్రధాన మంత్రి ఫసల్ భీమ యోజన (PMFBY) :

ప్రధానమైన వరి పంటకు కృష్ణా జిల్లాలో 2016 ఖరీఫ్ నుండి ప్రధానమంత్రి ఫసల్ భీమ యోజన/ ప్రధానమంత్రి పంట భీమా పధకం అమలులో ఉంది. గ్రామం యూనిట్ గా ఈ పంట భీమ పధకం అమలవుతుంది.

 1. ఈ గ్రామా భీమ పధకములో కనీసము 100 హెక్టార్లు ప్రధానమైన పంట ప్రాంతము కలిగిన గ్రామము ఒక యూనిట్ గా పరిగణింపబడును.
 2. గ్రామములో ఎంచుకున్న పంట ప్రాంతము 100 హెక్టార్ల కన్నా తక్కువగా న్నునచో ప్రక్కనున్న గ్రామాలను ఈ భీమా విభాగపు ఏర్పాటుకు సమీకరింవచ్చును.
 3. అమలు చేయువలసిన పంట కోత ప్రయోగాలూ

గ్రామం యూనిట్ గా అమలు చేస్తే                                  –           4 ప్రయోగాలు
2 నుంచి 5 గ్రామాలు యూనిట్ గా అమలు చేస్తే                      –           4 ప్రయోగాలు
5 గ్రామాలు కన్నా ఎక్కువ గ్రామాలు /మండలం యూనిట్ గా అమలు చేస్తే  –     10 ప్రయోగాలు
మండలం యూనిట్ గా అమలు చేస్తే                                  –           16 ప్రయోగాలు చేయాలి
భారత ప్రభుత్వము 2016 ఖరిఫ్ సీజన్ నుండి ప్రధాన మంత్రి ఫసల్ భీమ యోజన పధకమును ప్రారంభించింది. ఈ పధకమును రాష్ట్రం లోని అన్ని జిల్లాలలో అమలు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం చేసింది.

ప్రమాద భీమ మరియు మినహాయింపులు :
  1. నాట్లు నిపుదల: (నోటిఫైడ్ ప్రాంతము ఆధారముగా) :

   ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు, నోటిఫైడ్ ప్రాంతములో నున్న భీమ రైతులు భీమ చేసిన మొత్తములో నుండి 25% వరకు నష్టపరిహారం పొందుటకు ఆహార్వులు .

  2. స్టాండింగ్ పంట (విత్తులు నుంచి కోయుట వరకు) :

   నిరోధించలేని ప్రమాదాలు – కరువు, పాడి వాతావరణము, వరదలు, తెగ్గుళ్ళు మరియు వ్యాధులు, కొండచరియలు విరిగిపడుట, అగ్ని ప్రమాదాలు, తూఫాన్లు, వడగండ్ల వానలు, టై ఫూన్లు, హరికేన్లు, సుడిగాలులు మొదలైన దిగుబడి నష్టములు వాటిల్లినపుడు సమగ్ర ప్రమాద భీమ యివ్వబడును.

  3. కోసిన పంట ఆరుట కొరకు పొలములో ఉన్నపుడు, ఆకాల వర్షములు, తూఫాన్లు వంటి నిర్దిష్ట అపాయములు సంభాలించినప్పుడు, కోత కాలము నుండి 14 రోజులలో భీమ అందించబడును.
రాష్ట్రంలో భీమా అమలు చేసే సంస్థలు:
IFFCO

ప్రధాన మంత్రి ఫసల్ భీమా పధకము క్రింద జిల్లాలో రబీ సిజన్ లో గుర్తించబడిన పంటలు:

1.వరి (గ్రామా భీమా విభాగము)   2.మొక్కజొన్న (DIU), 3. పెసలు(MIU) 4.పత్తి(UI) (MIU) 5.వేరుశనగ(UI) (MIU) 6.చెరుకు (P) (MIU) 7. చెరుకు (R) (MIU)

వ్యవసాయ గణాంకాలలో ఉత్పత్తి అనునది ఒక ముఖమైన అనుబంధ ప్రమాణము. దీనికి ప్రాంతము మరియు దిగుబడి అవసరము. ఇతర చరరాశుల కన్నా దిగుబడి అతి సున్నితమైనది.ఉత్పాదకతను అతి చిన్న ప్రమాణాలైన డెకా గ్రామములలో సరితూచి, ఫోరం -II లో ఫలితాలను నమోదు చేయబడును.

పంట అంచనా సర్వేలు:

వివిధ పంటలు ఉత్పత్తి సమాచారమును పొందుటకు ముఖ్యమైన ఆహార మరియు ఆహారేతర పంటలకు పంట కోత ప్రయోగాలు నిర్వహించి, ఎకరానికి వచ్చు దిగుబడిని క్షేత్ర ప్రోయోగాల నివేదికల ద్వారా పొందవచ్చును. ఈ విధముగా సేకరించిన దిగుబడి బట్టి భీమా చేయబడిన పంటలు యొక్క మండల సగటు దిగుబడిని లెక్కించవచ్చు. ఈ దిగుబడి సమాచారమును ఆధారముగా చేసుకొని పంట భీమా చెల్లింపులు డైరెక్టరేట్ అఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ చే ఖరారు చేయుబడును. పంట కోతకు వచినప్పుడు పంట కోత ప్రయోగాలూ ముఖ్య ప్రణాళిక అధికారి ఎన్.ఎస్.ఎస్.ఒ, అగ్రికల్చర్ మరియు జనరల్ ఇన్సూరెన్స్ మరియు సిబ్బందిచే పర్యేవేక్షిoచబడును.

వ్యవసాయ పంట ధరలు:

ముఖ్యమైన పంటల యొక్క ఉత్పత్తి విలువను విశ్లేషించుటకు కోతలు ముమ్మరంగా ఉన్న దశలో పంటల ద్వారా రైతు పొందు ధరలు ఎన్నికైన గ్రామము నుండి సేకరించబడును.

వ్యవసాయ గణాంకాలను సకాలంలో నివేదించుట:

టి.ఆర్.ఎ.ఎస్. కార్డ్ ల ద్వారా ప్రతి సంవత్సరము వివిధ పంటల గణాంకాలు సేకరించుటకు మొత్తము రెవిన్యూ గ్రామలలో 20% నమునా గ్రామలు ఎంపిక చేయుబడును. అడంగలు ప్రకారం పంట విస్తీర్ణం యొక్క గణనను నమూనా తనిఖి చేయటకు 1.0 మరియు 1.1 షెడ్యూల్స్ సేకరించబడును. పైన సేకరించిన సమాచారమును ఆధారముగా చేసుకొని ప్రభుత్వము ముందుగానే పంట ప్రాంతపు గణాంకాలను అంచనా వేయగలదు.

II. ధరలు:
నిత్యావసర వస్తువుల ధరలు:

ప్రతిదినము 4 డివిజనల్ ప్రధాన కేంద్రాల యొక్క సంబంధిత ఎ.ఎస్.ఒ. ద్వారా ఆరు నిత్యావసర వస్తువుల రోజువారీ ధరలు సేకరించబడి, ఆన్ లైన్ ద్వారా డైరెక్టరేట్ అఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ , విజయవాడకు అందజేయుబడును.ప్రతి వారాంతపు శుక్రవారము 4 డివిజనల్ ప్రధాన కేంద్రాల యొక్క సంభందిత డివిజినల్ ఉపగణాంక అధికారులచే 21 నిత్యావసరాల వస్తువుల వారపు ధరలు సేకరించబడి ఆన్ లైన్ ద్వారా D.E & S విజయవాడ కు పంపబడును.

వినియోగదారుడి ధర పట్టిక (IW)/ వినియోగ ధరల సూచి:

ఎంపిక చేయబడిన పారిశ్రామిక కేంద్రాలైన జగ్గయ్యపేట నుండి వారపు, నెలవారీ వినియోగ ధరలను సేకరించి, డైరెక్టరేట్ అఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ , విజయవాడ వారికీ నేరుగా నివేదించబడును. ప్రతి నెల విజయవాడ నుండి వినియోగ ధరల సూచిని ఎంపిక చేసి ఈ షెడ్యూల్ ను నేరుగా  చెన్నై కు పంపబడును.

పారిశ్రామిక ఉత్పత్తి (I.I.P):

జిల్లాలో ఎంపిక చేయబడిన 31 పరిశ్రముల నుండి ప్రతి నెల ఉత్పత్తి వివరములను సేకరించి, రాష్ట్ర పారిశ్రామిక వృద్ది రేట్ లెక్కించుటకు సంచాలకులు, అర్థగణాంకశాఖ వారికి సమర్పించబడును.

వ్యవసాయ మరియు వ్యవసాయేతర కార్మికుల రోజువారీ వేతనాలు:

ఘంటసాల, పామర్రు, ఇబ్రహీంపట్నం మరియు విస్సన్నపేట నుండి వ్యవసాయ మరియు వ్యవసాయేతర కార్మికుల రోజువారీ వేతనాలను నెలకు ఒకసారి సేకరించి సంచాలకులు, అర్థగణాంకశాఖ వారికి సమర్పించబడును.

III.రీజినల్ అకౌంట్స్:

ప్రతి సంవత్సరము పెట్టుబడులు అంచనా వేయుటకు స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీలు, మండల ప్రజాపరిషత్ లు, జిల్లా పరిషత్ లు, మున్సిపాలిటీలు నుండి ఆదాయం మరియు వ్యయ వివరములను సంభందిత శాఖల నుండి సేకరించి సంచాలకులు, అర్థగణాంకశాఖ వారికి సమర్పించబడును.

IV.హ్యాండ్ బుక్:

పరిశోధకులకు, ప్రణాళికులకు, నిపుణలకు మరియు ప్రజలకు ఉపయోగపడుటకు ప్రతి సంవత్సరము జిల్లాలో గల అన్ని ప్రధాన విభాగముల యొక్క గణాంకాల సమాచారము మరియు వారి విజయాలతో కూడిన వివరములు పుస్తకము రూపములో ప్రచురణము చేయబడుచున్నవి. 2018-19 సంవత్సరము క్రొత్త గణాంకాల వివరములు తయారీలో నున్నది.

V.సామజిక ఆర్దిక సర్వే:

గృహ వినియోగం వ్యయం, గృహ సాంఘిక వినియోగం. ఆరోగ్యం మరియు విద్య మొదలగు అంశాలను వివరించు 77 వ సామజిక ఆర్దిక సర్వే జూలై 2017 నుండి ప్రారంభించబడి జూన్ 2018 న ముగియనున్నది.

VI.జనాభా గణన సర్వే నిర్వహించుట:
i)భూమిపై యాజమాన్య వివరములు గణన:

ప్రతి గ్రామములో ప్రతి 5 సంవత్సరములకు ఒక సరి యాజమాన్య పరిమాణం.కౌలు యాజమాన్య నీటిపారుదల మెదలగు అంశాలలో మార్పులను అంచనావేయుతకు భూమిపై యాజమాన్య వివరములు గణన నిర్వహిచాబాడును. ఇటీవల 2015-16 సం. సర్వే నిర్వహిచబడినది. జిల్లా నివేదిక డైరెక్టరేట్ అఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ , విజయవాడకు సమర్పించబడినది.

ii)చిన్న నీటిపారుదల గణన:

2013-14 సం. 5 వ చిన్న నీటిపారుదల గణన చేయబడినది.

iii)ఆర్దిక గణన:

వ్యాపార సంస్థ వృద్దిని విశ్లేషించుటకు మరియు వాటికీ మౌలిక సదుపాయములు కల్పించుటకు 5 సంవత్సములకు ఒకసారి ఆర్ధిక సంస్థల గణన జరుగును. ఇటివల 2012 సం ఆర్దిక గణన నిర్వహించబడినది.   6వ ఆర్దిక గణన లో జిల్లాలో 5,39,760 గ్రామీణ వ్యాపార సంస్థ 3,75,624 పట్టణ వ్యాపార సంస్థ సర్వే చేయబడినవి.

iv)పరిశ్రమల వార్షిక సర్వే (ASI):

పరిశ్రమల వార్షిక సర్వే 2002-03 సం ప్రారంభిచబడినది.ప్రతి సంవత్సరము పారిశ్రామిక రంగము నుండి స్దుల జిల్లా దేశాయ ఉత్పత్తికి పెట్టుబడుల ప్రణాళిక కొరకు ఎoపీక చేయబడిన పరిశ్రమల పారిశ్రామిక ఉత్పత్తి మరియు వాల్వు అడేడ్ కొరకు ఈ పరిశ్రమల వార్షిక సర్వే నిర్వహించబడును.

జిల్లా స్థూలఉత్పత్తి మరియు తలసరి ఆదాయం (ప్రస్తుత ధరలలో)
అంశం 2015-16 2016-17 2017-18
స్థూల జిల్లా దేశాయ ఉత్పత్తి GDDP రూ. కొట్లలో 68976 83317 97059
తలసరి ఆదాయం (పి.సి.ఐ (NDDP) –రూపాయలలో 136763 163815 189121
సంప్రదించవల్సిన వారి వివరములు :
వరుస సంఖ్య పేరు హోదా మొబైల్ ఆఫీస్ ఫోన్ నెం ఇమెయిల్
1 సిహెచ్. వి. యస్.  భాస్కర శర్మ ముఖ్య ప్రణాళికాధికారి 9849901484 08672-251881 cpokri[at]gmail[dot]com
2 టి. హిమప్రభాకర్ రాజు అసిస్టెంట్ డైరెక్టర్ 9440758201 08672-251881

సమాచార హక్కు చట్టం

జిల్లా హ్యాండ్ బుక్ 2017-18