మైనారిటీ సంక్షేమ శాఖ
కృష్ణాజిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ వారి అభివృద్ధి కార్యక్రమాలు
పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు:
2018 – 19 సంవత్సరమునకు గాను స్కాలర్ షిప్పు క్రింద రూ 6.17 కోట్లు మరియు ఫి రియంబర్స్ మెంట్ రూ 23.65 కోట్లు బడ్జట్ కేటాయించగా స్కాలర్ షిప్పు క్రింద మరియు ఎరియర్స్ నిమిత్తం రూ 6.07 కోట్లు మరియు ఫి రియంబర్స్ మెంట్ క్రింద,ఎరియర్స్ నిమిత్తం గాను రూ 23.65 కోట్లు విడుదల చేయడమైనది.
విదేశీ విద్యా పధకం:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మైనార్టీస్ విద్యావంతులకు విదేశి విద్యా పధకం ద్వారా విదేశాలలో చదువుటకు చక్కటి అవకాశం కల్పిస్తున్నది. రూ 10.00 లక్షలు స్కాలర్ షిప్పు మరియు రూ 5.00 లక్షలు వడ్డీ రాయితి తో బ్యాంకు లోను మంజూరు చేయబడును. అర్హత కలిగిన మైనారిటీ విద్యావంతులు www.apepass.cgg.gov.in నందు అప్లై చేసుకోగలరు. 2017-18 సంవత్సరమునకు గాను 24 మందికి రూ. 1.40 కోట్లు రిలీజు చేయడమైనది. 2018-19 సంవత్సరమునకు గాను 74 మందికి రూ. 5 కోట్లు రిలీజు చేయడమైనది.
దుల్హన్:
2015-16 నుండి ప్రభుత్వము వారు పేద క్రైస్తవ, ముస్లిం,సిక్కు,జైన మరియు పార్సీ యువకులకు వివాహము నిమిత్తం ఒక్కొక్క జంటకు రూ 50,000/- ఆర్దిక సహాయం చేయుచున్నారు. 2018-19 ఆర్ధిక సంవత్సరమునకు గాను రూ433 కోట్లు బడ్జెట్ విడుదలచేసియున్నారు. 606 జంటలకు రూ.3.03 కోట్లు విడుదల చేయడమైనది.ప్రస్తుతము ఈ స్కీమ్ వైస్సార్ పెండ్లి కానుక క్రింద మార్చడమైనది.
ఉచిత హాస్టల్ వసతి:
పోస్ట్ మెట్రిక్ హాస్టల్:
ఇంటర్.డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్,ఇంజనీరింగ్ మరియు వైద్య విద్యను అభ్యసించుచున్నమైనార్టీ విద్యార్దుల కొరకు 2008 సంవత్సరము నుండి విజయవాడలో 50 మంది మైనార్టీ బాలురతో పోస్టు మెట్రిక్ హాస్టలు నిర్వహించబడుచున్నది.2018-19 సంవత్సరమునకు గాను 40 మంది విద్యార్దులతో నడపబడుచున్నది.
సంక్షేమ కార్యక్రమాలు:
ఉర్దూఘర్ కం షాదీ ఖానాలు:
ముస్లిం వివాహములు, శుభకార్యముల నిమిత్హం ప్రభుత్వము వారు అవసరమైన చోట్ల ఉర్దూఘర్ కం షాదీ ఖానాలు మంజూరు చేయుచున్నారు.
ఆర్ధికసహాయము:
గ్రాంట్-ఇన్-ఏయిడ్:
కృష్ణాజిల్లా లో మతపర మైన సంస్థలకు అనగా మసీదులు , చర్చిలు , గురుద్వారాలు యొక్క నిర్మాణము,పునర్ నిర్మాణము మరియు మరమత్తుల కొరకు, ముస్లింల, క్రిస్టియన్ల శ్మశానవాటికల ఆభివృద్ధి పనుల నిమిత్తం ప్రభుత్వము వారు గ్రాంట్ ఇన్ ఏయిడ్ మంజూరు చేయుదురు.2017-18 సంవత్సరమునకు గాను మసీదు,బరియల్ గ్రౌండ్, కాంపౌండ్ వాల్ల్స్ నిర్మాణము నిర్మాణము రూ 2027 కోట్లు, మసీదు రిపేర్ల నిమిత్తం రూ 2.00 కోట్లు, మంజూరు చేయడ మైనది. 2018-19 సంవత్సరమునకు గాను చర్చ్ ల రెనోవేషన్ మరియు రిపేర్ల నిమిత్తం రూ 5.525 కోట్లు ప్రభుత్వము వారు మంజూరు చేసి యున్నారు. నిర్మాణములు మరియు రేపేర్లు జరుగుచున్నవి.
చర్చ్ లకు అనుభంధముగా నడిచే సంస్థలకు ఆర్ధికసహాయం:
క్రైస్తవ సంస్థల ద్వారా నిర్వ హింపబడుచున్న హాస్పిటల్స్ స్కూల్ బిల్డింగులకు,అనాధ శరణాలయములకు, వృద్దాశ్రయములు కమ్యూనిటి హాల్ మరియు యూత్ రిసోర్సు సెంటర్లలకు ఆర్ధికసహాయం అందించబడుచున్నది. 2018-19 సంవత్సరమునకు గాను అగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామములో కమ్యూనిటీహాలు నిర్మాణం నిమిత్తం 5.00 లక్షలు గవర్నమెంట్ వారు మంజూరు చేయడమైనది. సదరు కమ్యూనిటి హాల్ నిర్మించడమైనది.