విభిన్న ప్రతిభావంతుల, టి.జి. మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ
విభాగం యొక్క పాత్ర మరియు కార్యాచరణ:
విభిన్న ప్రతిభావంతులు, టి.జి. మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశ్యం విభిన్న ప్రతిభావంతులను మాములు వారితో సమానంగా మరియు శక్తివంతగా చేయడం మరియు వయో వృద్ధులకు పరిరక్షణ కల్పించడం.విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ 1983లో స్థాపించడమైనది. ఈ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశ్యము విభిన్న ప్రతిభావంతులైన పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్ లు, ఉపకార వేతనములు మంజూరు, విభిన్న ప్రతిభావంతులైన వారికి స్వయం ఉపాధి పధకము క్రింద సబ్సిడీ మంజూరు, ఉపకరణముల మంజూరు, విభిన్న ప్రతిభావంతుల హక్కుల సాధనకు 2016 చట్టం మరియు నేషనల్ ట్రస్ట్ యాక్ట్ 1999.తల్లిదండ్రుల, వయో వృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం, 2007 మరియు ఆంధ్ర ప్రదేశ్ తల్లిదండ్రుల, వయో వృద్ధుల పోషణ మరియు సంక్షేమ నిబంధనలు, 2011 ద్వారా వయోవృద్ధుల సంరక్షణ మరియు పరిరక్షణ, పోషణ మరియు అప్పీలు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయుట.
పథకాలు:
ప్రభుత్వ బాలుర వసతి గృహము :
విభిన్న ప్రతిభావంతుల, టిజి మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆద్వర్యంలో యల్.బి.యస్ నగర్ పాయకాపురం నందు విభిన్న ప్రతిభావంతులైన బాలురకు వసతి గృహము నిర్వహించబడుచున్నది. ఈ వసతి గృహము నందు 3వ తరగతి నుండి ఇంటర్మీడియట్, ఐ.టి.ఐ. పాలిటెక్నిక్, డిగ్రీ మరియు పి.జి. వరకు కళాశాలలో చదువుచున్న విభిన్న ప్రతిభావంతులైన విద్యార్ధులకు ప్రవేశము కలదు. ఈ వసతి గృహములో చేరువారికి ఉచితముగా వసతి, భోజన సదుపాయములు ఏర్పాటు చేయడమేకాక వారికి నోటు పుస్తకములు, దుస్తులు, కాస్మటిక్స్, ట్రంకు పెట్టెలు, బంకర్ బెడ్స్ ఇవ్వడం జరుగుచున్నది. ప్రత్యేకముగా ఈ వసతి గృహము నందు శిక్షణ పొందిన నర్స్ ద్వార నర్సింగ్ సేవలు అందజేయబడును.
ఉపకారవేతనములు (స్కాలర్ షిప్స్):
పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనములు (యం.టి.ఎఫ్.) మరియు భోధన రుసుములు తిరిగి చెల్లించుట (ఆర్.టి.ఎఫ్.) ఇంటర్మీడియట్ మరియు ఆపై డిగ్రీ, పి.జి. మరియు వృత్తి విద్య మరియు ఇంజనీరింగ్ కోర్సులు చదువుచున్న వారికి: విభిన్న ప్రతిభావంతులైన విద్యార్ధిని / విద్యార్థులకు ఉపకారవేతనములు రూపములో ఆర్ధిక చేయుతనందించుట జరుగుచునది. కళాశాలలో చదువుచున్న విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల రుసుములను ప్రభుత్వము నిర్ధారించిన రుసుముల మేరకు ఈ పధకము (ఆర్.టి.ఎఫ్.) ద్వార తిరిగి చెల్లించుట జరుగుచున్నది.
మెట్రిక్ పూర్వపు (ప్రి మెట్రిక్) ఉపకరవేతనము పొందుటకు అర్హత:
విద్యార్ధిని / విద్యార్థులు విభిన్న ప్రతిభావంతులై ఉండాలి మరియు ఆర్ధికంగా వెనుకబడిన బడిన వారై ఉండాలి. తల్లి దండ్రుల వార్షికాదాయము రు. 1,00,000/- లకు మించరాదు. ఈ పాస్ వెబ్ సైట్ (www.apepass.cgg.gov.in) ద్వార సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయుల సహాయముతో ఆన్లైన్ విధానములో దరఖాస్తు చేసుకొనగలరు. ఉపకారవేతనముల ద్వారా విద్యార్ధిని / విద్యార్థులకు ఈ క్రింది విధముగా బ్యాంకు ఎకౌంటునకు నగదు జమ చేయబడును.
1వ తరగతి నుండి 5వ తరగతి వరకు రు. 1000/- సం.రానికి.
6వ తరగతి నుండి 8వ తరగతి వరకు రు. 1500/- సం.రానికి
9వ తరగతి నుండి 10వ తరగతి వరకు రు. 2250/- సం.రానికి
మరియు దీనికి అదనంగా
శారీరక వికలాంగులకు రవాణా ఖర్చుల నిమిత్తం రూ. 1000/- సం.రానికి
శారీరక వికలాంగులైన వారు ధరించు కృత్రిమ అవయవాలు మరియు
కాలిపెర్స్ పోషణ అలవెన్సులు రూ.500/- సం.రానికి
అంధులకు రీడర్ అలవెన్సులు రూ. 1000/- సం.రానికి
ఆర్ధిక పునరావాస పధకము(సబ్సిడీ):
ఈ పధకము ద్వారా 18 సంవత్సరముల నుండి 60 సంవత్సరముల లోపు గల విభిన్న ప్రతిభావంతులైన వారికి స్వయం ఉపాధి చేసుకొనుట కొరకు రూ. 100000/- లేదా యూనిట్ విలువలో 50 శాతము సబ్సిడీ మంజూరు చేయబడును. వీరి యొక్కవార్షిక ఆదాయము రూ.100000/- కి మించి ఉండరాదు.ఈ పధకము కొరకు http://apobmms.cgg.gov.in అను వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకొనగలరు.
పెట్రోల్ సబ్సిడీ మంజూరు:
స్వయం ఉపాధి చేయుచున్న మరియు సొంత వాహనము కలిగి వార్షిక ఆదాయము రూ. 100000/- లోపు ఉన్న శారీరక వికలాంగులకు నెలకు 7.5 లీటర్ల పెట్రోల్ రాయితీ మంజూరు చేయబడును.
అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణములు:
శారీరక వికలాంగులకు:
- మూడు చక్రముల సైకిళ్ళు, చంక కర్రలు, వీల్ చైర్స్, కృత్రిమ అవయవములు, కాలిపర్స్
- స్వయం ఉపాధి చేయుచున్న మరియు పి.జి (లేదా) వృత్తి విద్యా కోర్సులు చదువుచున్న రెగ్యులర్ విద్యార్ధులకు మోటారు వాహనములు, బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ మంజూరు చేయబడును.
- డిగ్రీ, పి.జి (లేదా) వృత్తి విద్యా కోర్సులు చదువుచున్న రెగ్యులర్ విద్యార్ధులకు లాప్ టాప్స్ కూడా మంజూరు చేయబడును.
బధిరులకు (మూగ మరియు చెవిటి వారు):
- శ్రవణ యంత్రములు
- సైన్ లాంగ్వేజ్ తెలిసిన మూగ మరియు చెవిటి వారికి టచ్ ఫోన్లు
- డిగ్రీ, పి.జి (లేదా) వృత్తి విద్యా కోర్సులు చదువుచున్న రెగ్యులర్ విద్యార్ధులకు లాప్ టాప్స్ కూడా మంజూరు చేయబడును.
అంధులకు:
- అంధుల చేతి కర్రలు
- 9 వ తరగతి నుండి డిగ్రీ చదువుచున్న రెగ్యులర్ విద్యార్ధులకు డైసీ ప్లేయర్స్ మంజూరు.
- డిగ్రీ, పి.జి (లేదా) వృత్తి విద్యా కోర్సులు చదువుచున్న రెగ్యులర్ విద్యార్ధులకు లాప్ టాప్స్ కూడా మంజూరు చేయబడును.
పై ఉపకరణములు అన్నియు www.apdascac.gov.in అను వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొనగలరు.వీరి యొక్కవార్షిక ఆదాయము రూ. 100000/- కి మించి ఉండరాదు.
3% రిజర్వేషన్లు:
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ద్వారా ప్రత్యేక నియామకపు ప్రక్రియ ననుసరించి 3 శాతము రిజర్వేషన్ క్రింద వివిధ శాఖలలో గల ఖాళీలను గుర్తించి వికలాంగులకు బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుచున్నది.
వయోవృద్ధుల కొరకు సంక్షేమం:
ఉపకరణములు:
విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ వారి ద్వారా వయోవృద్ధులకు చేతి కర్రలు, చెవిటి మిషన్లు, యం.సి.ఆర్ చెప్పులు, కళ్ళజోళ్ళు ఉచితముగా పంపిణీ చేయబడును. వీరి యొక్కవార్షిక ఆదాయము రూ. 100000/- కి మించి ఉండరాదు.
ప్రభుత్వ వృద్ధ వికలాంగుల శరణాలయం:
60 సం నిండిన అనాధ వయోవృద్ధులకు ఈడేపల్లి, మచిలీపట్టణం నందు ప్రభుత్వముచే వృద్ధ శరణాలయం నడుపబడుచున్నది. ఈ శరణాలయం నందు ఉచితముగా వసతి, భోజన సదుపాయములు ఏర్పాటు చేయడమేకాక వారికి దుస్తులు, కాస్మటిక్స్, ట్రంకు పెట్టెలు, బంకర్ బెడ్స్ ఇవ్వడం జరుగుచున్నది. ప్రత్యేకముగా ఈ శరణాలయం నందు శిక్షణ పొందిన నర్స్ ద్వార నర్సింగ్ సేవలు అందజేయబడును.
వయోవృద్ధులకు గుర్తింపు కార్డులు:
ఈ శాఖ ద్వారా 60 సం నిండిన వయోవృద్ధులకు గుర్తింపు కార్డులు జారీ చేయబడును. ఈ గుర్తింపు కార్డులు ఉన్న వారికి రైలు మరియు బస్సు ప్రయాణములలో టిక్కెట్టు రుసుములో 20% రాయితీ ఇవ్వబడును.
సంస్థాగత నిర్మాణ క్రమము:
వ.సంఖ్య | అధికారి పేరు | హోదా | ఫోను నం. |
---|---|---|---|
1 | శ్రీ ఎ.వి.డి. నారాయణరావు | సహాయ సంచాలకులు | 900001361 |
2 | శ్రీ బి. రామ్ కుమార్ | పర్యవేక్షకులు | 9441548689 |
ఇమెయిల్ :-
addwkrsn[at]gmail[dot]com
శాఖాధిపతి
శ్రీ ఎ.వి.డి నారాయణరావు, యం.ఎ.యస్.డబ్ల్యూ
సహాయ సంచాలకులు,
విభిన్న ప్రతిభావంతులు, టి.జి మరియు
వయోవృద్ధుల సంక్షేమ శాఖ
కార్యాలయము యొక్క చిరునామా:
సహాయ సంచాలకులు,
విభిన్న ప్రతుభావంతులు, టి.జి మరియు
వయోవృద్ధుల సంక్షేమ శాఖ,
కలెక్టర్ కార్యాలయ ఆవరణ,
చిలకలపూడి, మచిలీపట్టణం – 521002.
కృష్ణాజిల్లా.
ఫోను నెంబర్. 08672-252637.