పర్యాటకం
కృష్ణా జిల్లా సాహిత్యమూ, కళలు, సంస్కృతులను గొప్ప వారసత్వ సంపదగా కలిగి, పర్యాటకులకు ఆ సంపద గురించి సంగ్రహముగా తెలియ జేయు చిహ్నముగా నున్నది. ఈ జిల్లాలోని పర్యాటక ప్రదేశములకు చేయు ప్రయాణము మిమ్ములను నిరశాపరచదు. ఈ ప్రదేశములకు మరల మరల సందర్శించినా మొట్టమొదట కలిగిన ఆనందమే కలుగును.
ఈ పర్యాటక ప్రదేశాలు కలిగించు ఆహ్లాదము ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ప్రసరణ జరిగినట్లు భావనను కలిగించును. ఈ పర్యాటక ప్రదేశాల ఆకర్షణ మనలను మంత్రముగ్ధులను చేయును. ఈ అందాలను ఆస్వాదిస్తూ ఈ ప్రదేశాలను సందర్శించుట ఒక గొప్ప అనుభూతి.
ఈ పర్యాటకులకు ఆతిధ్యం యివ్వడం తమ అధికారిక హక్కుగా పర్యాటక శాఖవారు భావిస్తారు. పర్యాటక శాఖవారు, పర్యాటకులను ఆనందానికి ప్రత్యామ్నాయముగా పర్యాటక ప్రదేశాలను ఎంచుకున్న ప్రత్యెక వ్యక్తులుగా భావిస్తారు.
కృష్ణా జిల్లా పర్యాటక శాఖ వారు వివిధ పర్యాటక ఎంపికలను అందిస్తున్నారు. వాటిలో కొన్ని ఈ క్రింది ఇవ్వబడ్డాయి.
- తీర్ధయాత్రా పర్యాటక రంగం
- సాంస్కృతిక పర్యాటక రంగం
- పర్యావరణ పర్యాటక రంగం
- ఇంజనీరింగ్ పర్యాటక రంగం