ముగించు

ఉద్యాన శాఖ

ఉద్యాన శాఖ కృష్ణాజిల్లాలో 1.12 లక్షల హె.లలోఉద్యాన పంటలుసాగు అవుతున్నాయి. ముఖ్యమైన ఉద్యాన పంటలు మామిడి, జామ, అరటి,నిమ్మ, అయిల్‌ పాం, కొబ్బరి, కోకో, పసుపు, మిరప, వివిధ రకాల కూరగాయలు మరియు పూలు. 2018-19 సం.లో రాష్ట్రీయ కృషి వికాస యోజన, రాష్ట్ర అభివృద్ధి పధకము మరియు ఆయిల్‌ పాం అభివృద్ధి పధకము క్రింద మొత్తం 2085.699 లక్షలతో అభివృద్ధి సాధించడం జరిగింది. 2019-20 సం.లో రైతులు సమగ్ర అభివృద్ధి లక్ష్యముగా రూ.2419 లక్షలతో దిగువ తెలిపిన వివిధ పధకములు అమలు జరుగుచున్నవి.రాష్ట్రీయ కృషి వికాస యోజన మరియు రాష్ట్ర అభివృద్ధి పధకములు :

 1. పండ్లు మరియు పూల తోటల విస్తరణ పధకము :

  ఈ పధకము క్రింద జిల్లాలో మామిడి, బొప్పాయి, జామ, నిమ్మ, కోకో, ఆపిల్ బెర్, జీడి మామిడి, దానిమ్మ టిష్యూ కల్చర్‌ అరటి మొదలగు పండ్ల తోటలు, మల్లె, చామంతి, బంతి, లిల్లి వంటి పూల తోటలు విస్తరణకు పెట్టుబడి పై రాయితీ ఇవ్వడం జరుగుతుంది.

 2. మామిడి తోటలలో పధకము

  మామిడి తోటలలో

  • పునరుద్ధరణ పధకము :

   ఈ పధకములో ముదురు మామిడి తోటల పునరుద్ధరించ డానికి, కొమ్మ కత్తిరింపులు మరియు ఎరువుల వాడకానికి హె. కు 50% రాయితీ (రూ. 17500/- ) ఇవ్వడం జరుగుతుంది.

  • సేంద్రియ వ్యవసాయం :

   ఈ పధకములో 2000 హె. లక్ష్యముగా మామిడి తోటలకు సేంద్రియ ఎరువుల వాడకానికి 50% రాయితీ 3 సంవత్సరాల పాటు ఇవ్వడం జరుగుతుంది.

 3. కూరగాయల పంటల అభివృద్ధి పధకములు :

  హైబ్రీడ్‌ కూరగాయ విత్తనములకు 50% లేదా హెక్టారుకు రూ. 3,000/-, తీగలు / దడులపై టమోటా మరియు తీగ జాతి పంటల సాగు పధకములో : హె.కు 50% లేదా రూ.18,750/- రాయితీ, శాశ్వత పందిళ్ళకు హె. 50% లేదా రూ.2,50,000/- రాయితీ, షేడ్‌ నెట్‌ హౌస్‌లలో కూరగాయల నారు పెంపకానికి ఒక్కొక్క చ.మీ. రూ.70/- రాయితి, కూరగాయల రవాణాకు చిన్న మోటారు వాహనాల సరఫరా పధకములో రైతు సహకార సంఘాలకు రవాణా వాహనం పై రాయితీ గరిష్టంగా రాయితీ ఇవ్వబడుతుంది.

 4. పండ్లు మరియు కూరగాయల రవాణాకు ప్లాస్టిక్‌ క్రేట్ల సరఫరా పధకము :

  ప్లాస్టిక్‌ క్రేట్ల సరఫరా పై ఒక్కొక్కొటి రూ. 120/- చొప్పున రాయితీ ఇవ్వబడుతుంది.

 5. యాంత్రీకరణ పధకము :

  ఈ పధకము క్రింద హైడ్రాలిక్ మిషన్లు , రోటోవేటరర్లు, పవర్ వీడర్లు, మినీ ట్రాక్టర్లు, బ్రష్ కట్టర్లు, మల్చింగ్ యంత్రము, తైవాన్ స్ప్రేయర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు, సిల్పాలిన్ పట్టాలు మొ: 50% రాయితీతో రైతులకు అందించబడుతున్నవి.

 6. పంటల కోత అనంతరం యాజమాన్యం :

  ఈ పధకంలో ప్యాక్ హౌస్ లకు (రూ.2,00,000/-) రైపనింగ్ ఛాంబరకు (రూ.21,00,000/-), మామిడి ప్రోసెసింగ్ యూనిట్లకు (రూ.10,00,000/-) నాణ్యత నిర్దారణ ప్రయోగశాల లకు (రూ.200,00,000/-), శీతలీకరణ గిడ్డంగులకు (రూ.140,00,000/-) గ్రేడింగ్ ప్యాకింగ్ పరికరాలకు (రూ.6,00,000/) 50% రాయితీ లు కల్పించబడును.

 7. మామిడి, మిరప మరియు కురగాయాలలో సమగ్ర సస్య రక్షణ పధకం :

  ఈ పధకం క్రింద రైతులకు సస్యరక్షణ పరికరాలు, మందులు రాయితీతో హె.కు రూ. 5000/- అందించటం జరుగుతుంది.

 8. రైతు సంఘాల ఏర్పాటు :

  ఈ పధకంలో ఉత్పత్తి మొదలు మార్కెటింగ్ వరకు రైతులు మరియు ఉత్పతి దారుల సంఘాలకు సహకారం అదించడం ద్వారా నాణ్యమైన ఉద్యాన ఉత్పత్తులు వినియోగదారులకు అందించడం జరుగుతుంది.

 9. నీటి కుంటలు :

  రైతులకు నీటి కుంటలు ఏర్పాటుకు 10 మీ. కు రూ. 18,750/-, 20 మీ. కు రూ. 75,000/-మరియు సాముహిక నీటి కుంటలకు 100 మీ. కు రూ. 20,00,000/- చొప్పున రాయితీ ఇవ్వబడుతుంది.

 10. రైతుల విజ్గ్నాన యాత్రలు:

  ఆధునిక పద్ధతులను ఉపయోగించి అధిక మరియు నాణ్యమైన దిగుబడులను పొందుతున్న రైతుల తోటలను సందర్శించడానికి 2 రోజుల పాటు 6 ప్రదేశాలకు విజ్నాన యాత్రలు, ఒక రోజు శిక్షణా కార్యక్రమాల ద్వారా రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

II.జాతీయ నూనె గింజలు మరియు ఆయిల్‌ పాం మిషన్‌ లో ఆయిల్‌ పాం అభివృద్ధి పధకము :

 1. 1 హెక్టారుకు క్రొత్తగా ఆయిల్‌ పాం తోటల సాగుకు మొక్కలపై రూ.12000/-రాయితీ కల్పించబడును.
 2. 4 సంవత్సరముల పాటు ఎరువులపై ప్రతి సంవత్సరము ఒక హెక్టారుకు రూ.5000/-చొప్పున రాయితీ.
 3. ఆయిల్‌ పాం తోటలలో అంతర పంటల సాగుకు నాలుగు సంవత్సరముల పాటు ప్రతి సంవత్సరము 1 హెక్టారుకు రూ.5000/- చొప్పున రాయితీలు కల్పించబడును.
 4. వానపాముల ఎరువు తయారీ యూనిట్ల నిర్మాణమునకు యూనిటకు రూ.15000/- రాయితీ.
 5. ఆయిల్‌ పాం తోటల విస్తరణకు హెక్టారుకు రూ.12000/- రాయితీ ఇవ్వడం జరుగుతుంది.

సంప్రదించవలసిన వివరాలు:
సంక్య ఆఫీసర్ యొక్క పేరు వ్యక్తిగత హోదా ఫోన్ నం.
1 బి. దయాకర బాబు ఉద్యాన సహాయ సంచాలకులు 7995086772
2 సి.హెచ్. చందు జోసెఫ్ సుందరం ఉద్యాన అధికారి, వెల్లటూరు, I/C ఉద్యాన అధికారి, (సాం.) విజయవాడ 7995086879
3 యన్. వేణు మాధవ్ ఉద్యాన అధికారి, మైలవరం 7995086878
4 సుహైల్ అహ్మద్ ఉద్యాన అధికారి, ఇబ్రహింపట్నం 7995086880
5 జి. లకపతి ఉద్యాన అధికారి, కంకిపాడు 7995086881
6 టి. వర్దిని ఉద్యాన అధికారి, జగ్గయ్యపేట్ 7995086882
7 యస్. నీలిమ ఉద్యాన అధికారి, నందిగామ 7995086877
8 సి.హెచ్. సుబ్రమన్నేస్వర రావు ఉద్యాన విస్తరణా అధికారి, I/c ఉద్యాన అధికారి, మచిలీపట్టణం 7995086885

చిరునామా :

శ్రీ బి.దయాకర బాబు
ఉద్యాన సహాయ సంచాలకులు
విజయవాడ,కృష్ణాజిల్లా .