ముగించు

నీటి పారుదల సర్కిల్

జలవనరుల శాఖ – కృష్ణా జిల్లా

నీటిపారుదల ప్రొఫైల్: –
వరుస సంఖ్య భౌగోళిక ప్రాంతం యొక్క వర్గీకరణ ఎకరములలో విస్తీర్ణం మొత్తం భౌగోళిక ప్రాంతం యొక్క శాతం
1 మొత్తం భౌగోళిక ప్రాంతం 21,56,441
2 అటవీ ప్రాంతం 1,88,255 8.73
3 సాగు ప్రాంతం 14,86,000 68.90
4 బంజరు మరియు సాగు చేయలేని భూమి 90,826 4.21
5 వ్యవసాయేతర వినియోగానికి ఉన్నా భూమి 3,71,287 17.22
6 నాటిన భూమి
7 నీటిపారుదల ప్రాంతం

మున్నేరు అయుకట్టు విస్తీర్ణం16,427 ఎకరములు

కృష్ణా జిల్లాలోని ఆయకట్టు వివరాలు :-

భారీతరహా నీటిపారుదల ప్రాజెక్ట్ (ఆయకట్టు >25,000 ఎకరములు):-

ప్రకాశం బ్యారేజి  (కృష్ణా తూర్పు డెల్టా ) 6,78,531 ఎకరములు
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్) 3,60,512 ఎకరములు
తారాకరామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (టి.ఆర్.ఎల్.ఐ ) 13,820 ఎకరములు
మొత్తము ఆయకట్టు విస్తీర్ణం 10,52,863 ఎకరములు

మధ్యతరహా నీటిపారుదల  ప్రాజెక్ట్ (ఆయకట్టు >5,000 ఎకరములు & <25,000 ఎకరములు):-

చిన్నతరహా  నీటిపారుదల  పధకము (ఆయకట్టు <5,000 ఎకరములు):-

>100 ఎకరములు (249  మైనర్ ఇరిగేషన్ చెరువులకు) 78,937 ఎకరములు
<100 ఎకరములు (675 మైనర్ ఇరిగేషన్ చెరువులకు) 26,366 ఎకరములు
మొత్తము (924 మైనర్ ఇరిగేషన్ చెరువులకు) 1,05,303 ఎకరములు
ఎపి.ఎస్‌.ఐ.డి.సి క్రింద లిఫ్ట్ ఇరిగేషన్ :-
ఈ ప్రాజెక్ట్ క్రిందప్రతిపాదించిన138  లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల యొక్క ఆయకట్టు వివరములు 1,33,283 ఎకరములు

భూగర్భ జలాలు మరియు బోర్ బావుల వివరాలు:-

కృష్ణాజిల్లాలోని   బోర్ బావుల  88577   వివరాలు 1,15,413 ఎకరములు
నీటిపారుదల క్రింద  కృష్ణా  జిల్లాలో మొత్తం అయుకట్టు 14,23,289 ఎకరములు

కృష్ణా జిల్లాలోని  ప్రధాన ప్రాజెక్ట్

ప్రకాశం  బ్యారేజి:-

https://irrigationap.cgg.gov.in/wrd/static/approjects/prakasam.html
ప్రకాశం బ్యారేజి కృష్ణానది పై విజయవాడ నగరం వద్ద పాత కృష్ణా ఆనకట్ట స్థానంలో 1954 నుండి 1957 మధ్య కాలం లో నిర్మించబడింది. సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు  మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ప్రధమ ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జ్ఞాపకార్ధం ఈ కట్టడానికి  కి “ప్రకాశం బ్యారేజి” అని పేరు పెట్టడం జరిగింది.
బ్యారేజి నిర్మించక ముందు గతంలో కృష్ణా డెల్టా కాలువలకు  సాగు నీటిని సరఫరా చేయుటకు మరియు వరదల నుండి రక్షణ కొరకు 1852 వ సంవత్సరం లో రూ.2.00 కోట్ల వ్యయం తో పాత కృష్ణా ఆనకట్ట నిర్మించుట జరిగింది. బ్రిటీష్ హయాం లో నిర్మించిన ఈ అనకట్టను సర్ ఆర్థర్ కాటన్ డిజైన్ చేయగా , నిర్మాణ బాద్యతలు కెప్టెన్ చార్లెస్ ఓర్ పర్యవేక్షించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 5.8 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ ఆనకట్ట ద్వారా నీటిని సరఫరా చేసేవారు.  అయితే 1952 సంవత్సరం  లో కృష్ణా నదికి వరదలు వచ్చిన సమయంలో పాత కృష్ణా అనకట్టకు గండి పడింది. గండి పరిశీలనకు వెళ్ళిన అప్పటి సూపరింటెండింగ్ ఇంజనీరు శ్రీ వేపా కృష్ణా మూర్తి గారు  మరియు ఇతర అధికారులు ప్రమాదవశాత్తూ విధి నిర్వహణలో ప్రాణాలు విడిచారు.

పాత కృష్ణా అనకట్టకు గండి పడిన తదుపరి, అన్నీ సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన పిదప ప్రస్తుతం ఉన్న ప్రకాశం బ్యారేజి నిర్మాణం 1954 నుండి 1957 మధ్య కాలం లో జరిగింది. భౌగోళికంగా 16°30’ N మరియు 80°37’ E అక్షాంశ రేఖాంశాల మధ్యన ప్రకాశం బ్యారేజి నిర్మించబడింది.

కృష్ణా డెల్టా లోని 13.07 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రకాశం బ్యారేజి ద్వారా నీటి సరఫరా జరుగుతుంది.  కృష్ణా తూర్పు డెల్టా లోని కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలకు అదేవిధంగా  కృష్ణా పశ్చిమ డెల్టా లోని గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలకు ఈ బ్యారేజి ద్వారా నీటి సరఫరా చేయబడుతుంది. ఈ డెల్టా యొక్క ఆయకట్టు వివరములు క్రింద తెలియజేయడమైనది.

కృష్ణా తూర్పు డెల్టా సిస్టం:

కృష్ణా జిల్లా 6,78,531 ఎకరములు
పశ్చిమ గోదావరి జిల్లా 58,000 ఎకరములు
మొత్తము 7,36,531 ఎకరములు

కృష్ణా పశ్చిమ డెల్టా సిస్టం:

గుంటూరు  జిల్లా 4,99,231 ఎకరములు
ప్రకాశం జిల్లా 72,120 ఎకరములు
మొత్తము 5,71,351 ఎకరములు

కృష్ణాడెల్టాలో త్రాగు నీటి అవసరాలు కొరకు 549  మంచి నీటి చెరువులు కలవు. అందులో కృష్ణాజిల్లాలో 378 మంచి నీటి చెరువులు గలవు , పశ్చిమ గోదావరి జిల్లాలో 48 మంచి నీటి చెరువులుతో పాటు గుంటూరు జిల్లాలో 104 మంచి నీటి చెరువులు  మరియు  ప్రకాశం జిల్లాలో 19 మంచి నీటి చెరువులు కలవు. దీనికి అదనముగా 4 జిల్లాల్లో ఉన్న 2 కార్పొరేషన్లు మరియు 9 మునిసిపాలిటీలకు త్రాగునీరు సరఫరా జరుగుతుంది.

కృష్ణా తూర్పు డెల్టా సిస్టం-జిల్లాలోని ప్రధాన కాలువలు:-

కృష్ణా జిల్లాలో ప్రవహించే ప్రధాన కాలువలు ఈ క్రింది విధంగా ఉన్నాయి :

సంఖ్య కాలువ పేరు మొత్తం పొడవు కి.మీ.లో. ఆయకట్టు లక్ష ఎకరములు డిజైన్ డిశ్చార్జ్
1 కృష్ణా తూర్పు ప్రధాన కాలువ 1.00 10600
2 ఏలూరు కాలువ 63.00 0.58 1643
3 రైవ్స్ కెనాల్ 57.70 1.75 4250
4 పొలరాజ్ కెనాల్ 41.80 0.44 645
5 క్యామ్ బెల్ కాలువ 38.10 0.49 705
6 బంటుమిల్లి కాలువ 42.00 0.65 935
7 బందర్ కాలువ 77.80 1.51 3035
8 K.E.B కాలువ 56.80 1.38 2050
మొత్తము 378.20 6.79

కృష్ణా డెల్టా తూర్పు డెల్టా సిస్టం – జిల్లాలో  డ్రైనేజి పారుదల వ్యవస్థ:-

డ్రైనేజి డివిజన్ గుడివాడ వారి పరిధి లో మొత్తము 21 భారీ మురగు కాలువలు, 54 మధ్యతరహా మురగు కాలువలు  మరియు 702  చిన్న తరహా మురుగు కాలువలు కలవు.

భారీ మురగు కాలువలు (21) మొత్తము పొడవు 533 కి.మి.
మధ్యతరహా మురగు కాలువలు (54) మొత్తము పొడవు 463 కి.మి.
చిన్న తరహా మురుగు కాలువలు (702) మొత్తము పొడవు 1756 కి.మి.

డాక్టర్ కె.ఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్ట్:-

పులిచింతల ప్రాజెక్ట్ కు  డాక్టర్ కె. ఎల్. రావు సాగర్ అని పేరు పెట్టారు. పులిచింతల ప్రాజెక్ట్ ను నీటిపారుదల అవసరాలకు, జల విద్యుత్ ఉత్పత్తి మరియు వరద నియంత్రణకు ఉపయోగపడే బహుళార్ధసాధక నీటిపారుదల ప్రాజెక్టు, పశ్చిమ గోదావరి, కృష్ణా , గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల  యొక్క నాలుగు (4) తీరప్రాంత జిల్లాల రైతులకు నీటిపారుదల సౌకర్యం కల్పించడములో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది అలాగే 13 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పిస్తుంది మరియు 45.77 టి.ఎం.సి సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ ను నిర్ముంచారు, దీనికి మొత్తం 24 గేట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో ఆగస్టు 2014 నుoడి నీటిని నిలువ  చేయడం ప్రారంభించారు.

తారక రామ లిఫ్ట్ ఇరిగేషన్ (టిఆర్ఎల్ఐ) పథకం:-

కృష్ణా జిల్లాలోని తారకరామ లిఫ్ట్ ఇరిగేషన్ పధకము క్రింద13,820  ఎకరముల అయుకట్టుకు విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుండి తిరిగి వచ్చే నీటిని బుడమేరు డైవర్షన్ ఛానల్ కి మళ్ళించిన నీటిని అందిస్తుంది.  నీటిని లెఫ్ట్ మెయిన్ కెనాల్  క్రింద 9000 ఎకరములు, రైట్ మెయిన్ కెనాల్ క్రింద ఉన్న 4820 ఎకరములు అయుకట్టుకు నీటిని అందిస్తుంది.

ఈ పధకము ద్వారా ప్రస్తుతo ఉన్న11,163 ఎకరములకు సాగు  నీరు అందించి సాగు చేయడం జరుగుతుంది, మరియు మిగులు 2,657 ఎకరములను సాగు చెయ్యవలసి ఉన్నది.

మునియెరు అనాకట్ట సిస్టం: –

కృష్ణానది యొక్క ఉపనది అయిన మునియేరు నది వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు నుండి ప్రారంభమై సుమారు 240 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలోని ఎటూరు గ్రామం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. మునియెరు ఆనకట్ట 1894-1898 సంవత్సరంలో పోలంపల్లి గ్రామ సమీపంలో నిర్మించబడింది.

మునియేరు అనాకట్ట ద్వారా వత్సవాయి, పెనుగంచిప్రోలు మరియు నందిగామ మండలాలలోని 25 గ్రామాలలోని 16,427 ఎకరముల ఆయుకట్టుకు నీరు అందించడమైనది .

జలవనరుల శాఖ వివరములు :

కృష్ణా జిల్లా లోని  జల వనరుల శాఖ పరిధి క్రింద 3  సర్కిల్ కార్యాలయములు ఉన్నాయి:

1 ఇరిగేషన్ సర్కిల్, విజయవాడ ప్రకాశం బ్యారేజ్, మునియేరు అనకట్ట సిస్టమ్, టి.ఆర్‌.ఎల్‌.ఐ, మైనర్ ఇరిగేషన్, డెల్టా డ్రైనేజ్ మొదలైనవి.
2 డాక్టర్ కె.ఎల్.ఆర్.ఎస్ పులిచింతల ప్రాజెక్ట్ సర్కిల్, విస్సన్నపేట. పులిచింతల ప్రాజెక్ట్, ఎన్‌ఎస్‌పి లెఫ్ట్ కెనాల్, చింతలపుడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్.
3 QC & QA సర్కిల్ ,నూజివీడు కృష్ణాజిల్లాలో అన్ని నీటిపారుదల పనులకు నాణ్యత నియoత్రణ విభాగము.

ఇరిగేషన్  సర్కిల్ విజయవాడ  క్రింద ఉన్న విభాగాలు :

ఇరిగేషన్ సర్కిల్, విజయవాడలో 1 పర్యవేక్షక ఇంజనీర్, 4 కార్యనిర్వాహక ఇంజనీర్లు, 16  ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు, 72 సహాయక ఇంజనీర్లు / సహాయక కార్యనిర్వాహక ఇంజనీర్లు మరియు కృష్ణా  జిల్లాలో 295 మంది  పరిపాలన సిబ్బంది ఉన్నారు.

ఇరిగేషన్ సర్కిల్, విజయవాడ క్రింద అభివృద్ధి కార్యకలాపాలు:

కృష్ణా  తూర్పు డెల్టా సిస్టం యొక్క ఆధునీకికరణ పనులు: –

కృష్ణాడెల్టా సిస్టమ్ ప్రాజెక్టును ఆధునీకికరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O Ms No.259, Dt. 29.11.2007 లో రూ.4573.00 కోట్లకు పరిపాలనా ఆమోదం తెలిపింది. ఇందులో విజయవాడలోని ఇరిగేషన్ సర్కిల్‌కు రూ.2180.12 కోట్లు కేటాయించారు. ఇందులో 14 కెనాల్ ప్యాకేజీలకు రూ.1577.89 కోట్లు మరియు 6 డ్రైనేజ్ ప్యాకేజీలకు రూ.602.23 కోట్లు కేటాయించడం జరిగినది. ఇవేకాకుండా, ఇంకా రూ.720.13 కోట్లు విలువైన 22 పనులకు  టెండర్లు పిలిచినప్పటికీ, గుత్తెదారులు నుండి ఎటువంటి స్పందన లేనందున, ఈ పనులను చేపట్టడం సాధ్యం కాలేదు.

  • రూ .54 కోట్ల వ్యయంతో ఉన్న 27 పనులను ఇపిసి సిస్టం క్రింద ప్రారంభించడం జరిగినది మరియు ఇప్పటివరకు ప్రాజెక్ట్ కు అయిన ఖర్చు  రూ.1090.86 కోట్లు.
  • 82 పనులను నాన్-ఇపిసి సిస్టం క్రింద రూ.97 కోట్ల వ్యయంతో కాలువలు మరియు మురుగుకాలువలు పనులు ప్రారంభించడం జరిగినది మరియు ఇప్పటివరకు ఖర్చు రూ.37.56 కోట్లు.
  • 9 పనులను 60 (సి) చట్టం క్రింద రూ.38 కోట్లతో చేపట్టారు మరియు ఇప్పటివరకు ఈ పనులకు అయిన ఖర్చు రూ.42.86 కోట్లు.
అన్ని గణాంకాలు కోట్లల్లో
వివరణ పనుల మొత్తము జరిగిన పనుల ఖర్చు పూర్తయిన పనుల ఖర్చు (పెరిగిన ఖర్చుతొ సహ) మిగిలిన పనుల ఖర్చు % పూర్తి యైనది
కాలువలు 13 1202.81 938.58 434.66 64%
మురుగుకాలువలు 9 196.57 154.95 47.25 76%
డ్రెడ్జిన్గ్ పనులు 5 47.16 40.18 9.07 81%
మొత్తము 27 1446.54 1133.71 490.98 66%
సం. వివరణ పనుల సంఖ్యా అగ్రిమెంట్ విలువ కోట్లలో పూర్తియైన పనులు విలువ కోట్లలో పురోగతి లో ఉన్న  పనులు వ్యయం కోట్లలో ప్రారంభం కానీ  పనులు/ పూర్తి యైనవని ప్రతిపాదించిన పనుల   సంఖ్య విలువ కోట్లలో

ఇపిసి సిస్టం

1 కాలువలు 13 1202.81 13 768.14
2 మురుగు కాలువలు 4 131.55 4 98.44
3 ఛానలైజేషన్ (బుడామెరు) 5 65.02 5 50.88
4 డ్రెడ్జిన్గ్ పనులు 5 47.16 3 21.38 1 16.71 1 4.49
మొత్తము 27 1446.54 3 21.38 23 934.17 1 4.49

నాన్-ఇపిసి సిస్టం

1 కాలువలు 30 20.717 25 12.07 1 4.05 4 0.68
2 మురుగు కాలువలు 52 53.254 38 24.23 9 6.39 5 15.13
మొత్తము 82 74.037 63 36.30 10 10.44 9 15.81

రామలింగేశ్వర నగర్ రక్షణ గోడ:

విజయవాడ నగరంలో కృష్ణానదికి ఎడమ ప్రక్కన ఉన్న రామలింగేశ్వర నగర్ కు వరద రక్షణ గోడ నిర్మించుటకు చేపట్టిన పనులను  హైదరాబాద్ కు చెందిన M/s SEW & PMPL JV వారికి 06/2015 లో రూ.93.22 కోట్లకు అప్పగించటమైనది మరియు ఈ పని క్రింద ఇప్పటివరుకు రూ.100.34  కోట్లకు ఖర్చు చేయడం జరిగినది. ఇప్పటి వరకు 90% పనులు పూర్తి యైనవి.

టైడల్ బ్యాంకు- జాతీయ తుఫాను విప్పత్తు విశ్లేషణ కార్యక్రమం (NCPMP):

కోన టైడల్ బ్యాంకు 0.00కి నుండి 18.60కి వరకు 11/2013 లో ప్రారంభించారు ఈ పని యొక్క  మొత్తం విలువ  రూ.33.94 కోట్లు. ఈ పని మోత్తము పూర్తి అయినది, దాని విలువ రూ.29.37 కోట్లు. కృత్తివెన్ను టైడల్ బ్యాంకు 3.00కి నుండి 14.30కి వరకు 7/2014 లో ప్రారంభించారు ఈ పని యొక్క  మొత్తం విలువ  రూ.34.03 కోట్లు . ఈ పని మోత్తము పూర్తి అయినది, దాని విలువ రూ.34.61 కోట్లు.

మైనర్ ఇరిగేషన్ పనులు:

కృష్ణాజిల్లాలో మొత్తము  924  చెరువులు ఉన్నాయి, వీటి క్రింద ఉన్న 1,05,303 లక్షల ఎకరముల ఆయుకట్టుకు సాగునీరు అందిస్తాయి. ఈ చెరువుల యొక్క పుడికతీత పనులు మరియు అభివృది పనులు ఈ ఎ.పి.ఐ.ఐ.ఎ.టి.పి పథకం క్రింద జరుగతుంది. ప్రపంచ బ్యాంకు మరియు జైకా సహాకారంతో ఈ పథకం నిర్వహించబడుతుంది.

గొలుసుకట్టు చెరువులు :

కృష్ణాజిల్లాలో, 322 చెరువులను కలుపుతూ 110 గొలుసు కట్టు చెరువులువున్నాయి వీటి క్రింద 55677 ఎకరాల  అయుకట్టు అభివృద్ధి చేశారు.

ఎ.పి.ఐ.ఎల్.ఐ.పి –II (చిన్న తరహా నీటి పారుదల శాఖ):-

కృష్ణాజిల్లాలో వర్షభావ పరిస్తితులు లేని ఎగువ మండలలో మైనర్ ఇరిగేషన్ చెరువులు అభివృది మరియు పునరుద్ధరణ పనులు కోసం 2 ప్యాకేజిలుగా ఎ.పి.ఐ.ఎల్.ఐ.పి – II మరియు జపాన్ బ్యాంక్ వారి  సహకరముతో రూ.5.81 కోట్ల విలువతొ చేపట్టారు.

ఎ.పి.ఐ.ఐ.ఎ.టి.పి:

ఎ.పి.ఐ.ఎల్.ఎ.టి.పి – II(మధ్య తరహా నీటి పారుదల శాఖ):

జైకా యొక్క సహకారంతో  మునియేరు ప్రధాన కాలువ 0.00  కి.మి. నుండి 42.64 కి.మి. వరకు ఆధునీకికరణ పనులను రూ.62.10 కోట్లతో M/s MSR constructions,ఖమ్మం వారికి అప్పగించబడినది,పనులు పురోగతిలో ఉన్నవి .

కృష్ణా డెల్టా సిస్టం యొక్క ఆపరేషన్ మరియు మెయిన్టేనెన్స్ పనుల వివరములు :

2014-15, 2015-16, 2016-17 మరియు 2018-19 ఆపరేషన్ మరియు మెయిన్టేనెన్స్ పనులను ప్లౌబ్యాక్ ఫండ్స్ తో కమిషనర్, కాడా వారి యొక్క అనుమతితో జరిగినవి.

*పనుల విలువ లక్షలలో*
సంఖ్య సంవత్సరం ఆమోదించబడిన పనులు అగ్రిమెంట్ అయిన పనులు చేపట్టిన  పనులు
సంఖ్య విలువ సంఖ్య విలువ సంఖ్య విలువ
1 2014-15 400 885.78 395 564.19 386 498.58
2 2015-16 532 873.02 445 751.06 439 698.45
3 2016-17 13 93.83 13 88.79 13 92.44
4 2017-18 524 1151.12 503 1007.80 464 810.85
5 2018-19 28 112.24 14 29.42 14 29.42
మొత్తం 1497 3115.99 1370 2441.26 1316 2129.74

2019-20 సంవత్సరoకు గాను 133 ఆపరేషన్ మరియు మెయిన్టేనెన్స్ పనులు కమిషనర్, కాడా వారిచే రూ. 19.20తో ఆమోదించబడినవి.ఈ పనులకి టెండర్ ప్రక్రియ జరిగి పనుల పురోగతిలో ఉన్నవి.

సంఖ్య డివిజన్ ఆమోదించబడిన పనుల సంఖ్య విలువ లక్షలలో
1 కృష్ణా సెంట్రల్  డివిజన్ 27 411.28
2 కృష్ణా తూర్పు డివిజన్ 63 715.63
3 స్పెషల్ డివిజన్ 3 52.47
4 డ్రైనేజి  డివిజన్ 40 740.87
మొత్తం 133 1920.25

కొత్త పనులు:

పోలవరం ఆర్.ఎమ్.సి – ఏలూరు లింక్ కాలువ :

పోలవరం ఆర్.ఎమ్.సి కాలువ (36.00 కి.మి) మరియు కృష్ణా ఏలూరు కాలువ (137.290 కి.మి) మొదలగు కాలువలను కలుపుతూ మల్లంగి చెరువు ద్వారా వాగులోకి కలుపుటకు  చేపట్టిన పనులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని M/s VSS Construction, కడప వారికి రూ.10.84 కోట్ల తో 02/2019 న పనులు అప్పగించటం జరిగినది, పనులు పురోగతిలో ఉన్నవి.

పెదలంక మురుగు కాలువ యొక్క డ్రెడ్జిన్గ్ పనులు:

పెదలంక మురుగు కాలువ యొక్క ఆధునీకరణ కొరకు “పెదలంక ప్రధాన మురుగు కాలువ 4.50 కి.మి నుండి 21.40 కి.మి  యొక్క పూడికతీత ” పనులను  రూ .23.10 కోట్ల తో ఆమోదించబడినది. టెండర్ ప్రక్రియ పురోగతిలో ఉన్నది.

రామిలేరు బ్రిడ్జి :

రామిలేరు మురుగు కాలువ మీద 0.40 కి.మి నందు  ఉన్న పైపు కాజ్ వే దగ్గర  కొత్త సింగల్ బ్రిడ్జిను రూ.1.60 కోట్లతో  M/s Sri Krishna Enviro వారికి అప్పగించబడినది.పనులు పురోగతిలో ఉన్నవి.

బ్రహ్హ్మలింగం చెరువు యొక్క పూడికతీత:

కృష్ణాజిల్లాలోని  గన్నవరం మండలం, చిక్కవరం గ్రామము నందు ఉన్న  బ్రహ్మలింగం చెరువు  లోని బిట్ నెంబర్.85 లో పూడికతీత పనులను రూ.15.66 కోట్లతో M/s NAS Babu Constructions Pvt Ltd.,గుడివాడ వారికి అప్పగించబడినది. పనులు పురోగతిలో ఉన్నవి.

తాతకుంట్ల,ఎర్ర చెరువు పూడికతీత పనులు:

కృష్ణాజిల్లాలోని  విసన్నపేట  మండలం, తాతకుంట్ల గ్రామము నందు ఉన్న  ఎర్ర  చెరువులో పూడికతీత మరియు వాకింగ్ ట్రాక్ తో పాటు గవర్నమెంట్ సైట్ ను  లెవెల్ చేయుట కొరకు గౌరవనీయులైన ముఖ్య మంత్రి గారి హామీ క్రింద ఆమోదం పొందటమైనది. పనులు పురోగతిలో ఉన్నవి.

వ్యవశ్థాపక పట్టిక:

contacts