దేవాదాయ ధర్మదాయ శాఖ కృష్ణా జిల్లా సమాచారం
దేవాదాయ ధర్మదాయ శాఖ – సంక్షిప్త సమాచారం
హిందూ దేవదాయ ధర్మదాయ సంస్థల పరిపాలనలు దేవదాయ చట్టం 30/1987 ప్రకారం నిర్వహింపబడును.
సంస్థల పరిపాలన వాటియొక్క సంవత్సర ఆదాయములు అనుసరించి ఈ దిగువ పేర్కొనబడిన అధికారుల పర్యవేక్షణలో నిర్వహింపబడును.
2 లక్షల లోపు ఆదాయము కల సంస్థలు 6(సి) కేటగిరి జిల్లా అసిస్టెంట్ కమీషనర్
2 నుంచి 25 లక్షల లోపు ఆదాయము కల సంస్థలు 6(బి) కేటగిరి జోనల్ డిప్యూటీ కమీషనర్
25 నుండి 1 కోటి లోపు ఆదాయము కల సంస్థలు 6(ఎ) కేటగిరి రీజినల్ జాయింట్ కమీషనర్
1 కోటి పైబడి ఆదాయము కల సంస్థలు 6(ఎ) కేటగిరి కమీషనర్
మటములు (Mutts) 6(డి) కేటగిరి కమీషనర్
సెక్షన్ 43 రిజిస్టర్ :- ప్రతీ సంస్థకు చెందిన స్థిర చర ఆస్తులు, దేవాలయం పుట్టుక, సిబ్బంది మొదలగు వివరము లన్నియు ఈ రిజిస్టర్ లో నమోదు కాబడియుండును.
సెక్షన్ 6(సి) :- ప్రతీ సంస్థ చట్టములోని సెక్షన్ 6 ప్రకారం publication కాబడి ఉండవలయును.
ధర్మకర్తల మండలి :- సెక్షన్ 15 ప్రకారము ప్రతీ సంస్థకు ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయవలయును. వాటి వివరములు.
ఆదాయ పరిధి | నియామకం చేయు అధికారి | సభ్యుల సంఖ్య | రిమార్కులు |
2 లక్షల లోపు ఆదాయము | డిప్యూటీ కమీషనర్ | 5 | మొత్తము సభ్యులలో ఒక SC/ఒక ST, ఒక BC, ఒక మహిళ ఉండవలయును. |
2 నుంచి 25 లక్షల లోపు ఆదాయము | కమీషనర్ | 7 | -డిటో- |
25 నుండి 1 కోటి లోపు ఆదాయము | ధార్మిక పరిషత్ | 9 | -డిటో- |
1 నుంచి 5 కోట్లు లోపు ఆదాయము | గవర్నమెంట్ | 9 | -డిటో- |
5 నుంచి 20 కోట్లు లోపు ఆదాయము | గవర్నమెంట్ | 11 | -డిటో- |
20 కోట్లు పైబడి గల ఆదాయము | గవర్నమెంట్ | 15 | -డిటో- |
ఏదైనా సంస్థకు గుర్తింప బడిన ఫౌండర్ ఫ్యామిలీ మెంబెర్ ఉన్న యెడల వారు ధర్మకర్తల మండలి చైర్మన్ గా వ్యవహరింతురు. దేవాలయ ప్రధాన అర్చకులు Ex-Officio Member గా వ్యవహరించెదరు.
ప్రభుత్వమునకు చెల్లించవలసిన పన్నులు/చెల్లింపులు
(2 లక్షల ఆదాయము కల సంస్థలకు పన్నులు నుండి మినహాయింపు కలదు.)
Endowment Administrative Fund
(గవర్నమెంట్ హెడ్ ఆఫ్ ఎకౌంటు కు చెల్లించ వలయును) సంవత్సరము అదాయములో 8 %
Common Good Fund సంవత్సరము అదాయములో 9 %
(కమీషనర్ ఆఫీస్ ఎకౌంటు కు చెల్లించవలయును)
Archaka Welfare Fund సంవత్సరము అదాయములో 3 %
(కమీషనర్ ఆఫీస్ ఎకౌంటు కు చెల్లించవలయును) (20 లక్షల పైబడి ఆదాయము గల సంస్థల నుండి)
Audit Fees సంవత్సరము అదాయములో 1.5 %
(గవర్నమెంట్ హెడ్ ఆఫ్ ఎకౌంటు కు చెల్లించ వలయును)
భూముల కవుళ్ళు/లైసెన్సు
వ్యవసాయ భూములు/షాపులు/స్థలములు/లైసెన్సు హక్కులు అన్నియు కౌలు కొరకు బహిరంగ వేలము cum టెండర్/బహిరంగ వేలము cum టెండర్ cumఈ టెండర్ ద్వారా మాత్రమే అమర్కము చేయవలయును
Description | Lease Period | |
Agricultural Lands | 3 Years | |
Fish Tanks | 5 Years | |
Licenses (Chappals, Human Hair, Coconut Halves, etc.,) | 1 Year | |
Lands/ Site | 11 years/33 years | Subject to prior special permission from the Government |