• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

ర్యాలీ – ఆజాదీకా అమృత్ మహోత్సవ్ – జిల్లా కలెక్టర్ అరిసెపల్లి అమృత్ సరోవర్ ట్యాంక్ పర్యటన

13/08/2022 - 15/08/2022
ARISEPALLI , MACHILIPATNAM MANDAL

స్వాతంత్ర్య ఉద్యమ పోరాట ప్రాశస్త్యం, పోరాట యోధుల స్ఫూర్తి, అమరవీరుల త్యాగ నిరతి వర్తమాన తరానికి అందించేందుకు ఉద్యుక్తులు కావాలని, అందుకు గాను ప్రతి ఒక్కరు స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగస్వామ్యులు కావాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషాగారు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ఆయన మచిలీపట్నం మండలం ఆరిసేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్టిపాలెం గ్రామంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. చిట్టిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు 150 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకంతో కూడిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు . పలువురు చిన్నారులు జాతీయ ఉద్యమ నాయకుల వేషధారణతో ముచ్చటగా కనబడతూ ర్యాలీకి నూతన ఉత్తేజం కల్పించారు. చిట్టిపాలెం గ్రామంలో వందలాధిగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనగా ఈ ర్యాలీ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమృత్ సరోవర్ వరకు కొనసాగింది. చెరువు గట్టుపై ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించారు.

Z1Z5Z6Z7Z9Z10Z11Z13Z15Z16Z37Z38Z21Z39Z17Z25Z27Z28Z29Z32