ఆగష్టు 15 – 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు – జిల్లా కలెక్టరేట్ లో జరిగిన వేడుకలు
15/08/2022 - 16/08/2022
COLLECTORATE , KRISHNA DISTRICT
కలెక్టరేట్ ప్రాంగణంలో స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు . జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా గారు ముఖ్యఅతిధిగా పాల్గొని , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల గారితో కలిసి కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు . తొలుత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళుర్పించారు . కలెక్టర్ పోలీస్ సిబ్బంది చేత గౌరవ వందనం స్వీకరించారు . అనంతరం భరతమాత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు . ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం . వెంకటేశ్వర్లు గారు , కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .