అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం – 2026 వేడుకలు – యోగాంధ్ర – 2026 కార్యక్రమం – గుడివాడ ఎన్ . టి . ఆర్ . స్టేడియం
10/06/2026 -
21/06/2026
అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం – 2026 వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర – 2026 కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం గుడివాడ ఎన్ . టి . ఆర్ . స్టేడియంలో లారీ , ఆటో డ్రైవర్ల అసోసియేషన్ ఇతివృత్తంతో భారీ సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో కలెక్టర్ డీ . కే . బాలాజి గారు , గౌరవ గుడివాడ శాసన సభ్యులు వెనిగండ్ల రాము గారు , గౌరవ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు గారు , జాయింట్ కలెక్టర్ ఎం . నవీన్ గారు , గుడివాడ ఆర్ .డి . ఓ . జి . బాలసుబ్రమణ్యం గారు తదితరులు పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు.