అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం – 2026 – ఉయ్యూరు ఏ . జీ . అండ్ . ఎస్ .జి . సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల – యోగాంధ్ర – 2026
21/06/2026 -
22/06/2026
అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం – 2026 సందర్భంగా ఆదివారం ఉదయం ఉయ్యూరులోని ఏ . జీ . అండ్ . ఎస్ .జి . సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడా మైదానంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొని యోగా ఆసనాలు చేశారు . కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారితో పాటు జాయింట్ కలెక్టర్ ఎం . నవీన్ గారు , గౌరవ పెనమలూరు శాసన సభ్యులు బోడె ప్రసాద్ గారు , గౌరవ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి గారు , గౌరవ ఏ . పీ . నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారు తదితరులు పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు .