ర్యాలీ – ఆజాదీకా అమృత్ మహోత్సవ్ – జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
13/08/2022 - 15/08/2022
DISTRICT MEDICAL AND HEALTH OFFICE , MACHILIPATNAM
జాతీయ స్ఫూర్తిని చాటుతూ, మహనీయుల ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జీ. గీతాబాయి అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం మచిలీపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కోనేరు సెంటర్ లో ఈ ర్యాలీని డిఎం అండ్ హెచ్వో డాక్టర్ గీతా బాయి ప్రారంభించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, సిబ్బంది, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు జాతీయ జెండాలు చేతబట్టి.. ‘జై ఇండియా జై జై ఇండియా’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోనేరు సెంటర్ నుంచి రేవతి సెంటర్, బస్టాండ్ సెంటర్ మీదగా డిఎంహెచ్వో కార్యాలయం వరకూ నిర్వహించారు.